News March 18, 2025
సీఎం కేసీఆర్ను కలిసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే

మాజీ సీఎం కేసీఆర్ను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, వరంగల్ జిల్లా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సోమవారం కలిశారు. రజతోత్సవ వేడుకల సందర్భంగా ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసిన నాటి టీఆర్ఎస్ రైతు నాగలి గులాబీ జెండాను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్కు అందజేసి, ఆనాటి పార్లమెంటరీ ఉద్యమ పంథా పోరాట జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
Similar News
News October 29, 2025
కందిలో ఆకుగూడు పురుగు – నివారణకు సూచనలు

అధిక వర్షపాతం ఉన్న సమయంలో ఈ ఆకుగూడు పురుగు పంటను ఆశిస్తుంది. కంది పంట ఎదుగుదల దశలో ఎక్కువగా, ఒక్కోసారి పూత దశలో కూడా ఆశిస్తుంది. లార్వాలు చిగురాకులను, ఆకులను గూడుగా చేసి లోపల ఉండి ఆకులను, పువ్వులను, లేత కాయలను కూడా తొలిచి తింటాయి. ఈ పురుగు నివారణకు లీటరు నీటిలో క్వినాల్ఫాస్ 25% ఇ.సి. 2.0 మి.లీ. (లేదా) మోనోక్రోటోఫాస్ 36% యస్.యల్ 1.6 మి.లీ. కలిపి పంటపై పిచికారీ చేయాలి.
News October 29, 2025
తుఫాన్ ప్రభావంతో పెద్దపల్లి పత్తి మార్కెట్ బంద్

తుఫాన్ కారణంగా అకాల వర్షాలు కురుస్తుండటంతో పత్తి తూకం, లోడింగ్ పనుల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రకటించింది. ఈ కారణంగా యార్డు గురువారం నుంచి శుక్రవారం వరకు మూతపడి ఉంటుందని పేర్కొంది. వాతావరణం అనుకూలిస్తే సోమవారం నుంచి పత్తి కొనుగోళ్ల కార్యకలాపాలు పునః ప్రారంభం అవుతాయని ఉన్నత శ్రేణి కార్యదర్శి తెలిపారు.
News October 29, 2025
పన్ను వసూళ్లపై కఠినంగా వ్యవహరించాలి: కలెక్టర్

పంచాయతీరాజ్ శాఖ పనితీరుపై అధికారులతో కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీక్ష నిర్వహించి NOV 1-7 వరకు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధం విధించాలని కోరారు. చెత్తసేకరణ, నీటినిల్వ నివారణ, పన్ను వసూళ్లు, తాగునీటి సరఫరాపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అనుమతిలేని నిర్మాణాలపై చర్యలుంటాయని అన్నారు.


