News August 12, 2024

సీఎం చంద్రబాబుకి విశాఖ వ్యక్తి స్పెషల్ గిఫ్ట్

image

విశాఖకు చెందిన చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ మిల్లెట్స్‌తో వేసిన చిత్రపటాన్ని సీఎం చంద్రబాబు నాయుడుకి అమరావతిలో సోమవారం స్వయంగా బహుకరించారు. ఏడాదికాలంగా దేశవ్యాప్తంగా ప్రముఖుల చిత్రపటాలను మిల్లెట్స్‌తో వేసినట్లు తెలిపారు. ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకొని మిల్లెట్స్‌కు ప్రజల్లో అవగాహన పెంచుతూ వందలాది చిత్రాలను తీర్చిదిద్దినట్లు సీఎంకి వివరించారు.

Similar News

News September 16, 2024

విశాఖ-దుర్గ్ వందేభారత్ టైమింగ్స్ ఇవే

image

విశాఖ నుంచి దుర్గ్ వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ వారంలో గురువారం మినహా ఆరు రోజులు నడపనున్నారు. 20829 నంబర్‌తో దుర్గ్‌లో ఉ.5:45కి బయలుదేరి అదే రోజు మ.1:45 నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖ నుంచి 20830 నంబర్‌తో మ.1:50 నిమిషాలకు బయలుదేరి అదే రోజు రాత్రి 11:50 నిమిషాలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈనెల 20వ నుంచి ఈ రైలు రెగ్యులర్‌గా తిరుగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే డీఆర్ఏం తెలిపారు.

News September 16, 2024

జీకే.వీధి: పచ్చకామెర్లతో విద్యార్థిని మృతి.?

image

గూడెం కొత్తవీధి మండలంలో మరో విషాదం నెలకొంది. ఆర్వీ నగర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని జంపారంగి.ధార అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం విశాఖ కేజీహెచ్‌లో చేరింది. అక్కడ చికిత్స పొందుతూ.. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచినట్లు టీడీపీ నేత సత్తిబాబు తెలిపారు. పచ్చకామెర్లతో బాలిక మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

News September 16, 2024

అరకులోయ: మళ్లీ పెరిగిన అల్లం ధరలు

image

అల్లం ధర మళ్లీ పెరిగింది. ఇటీవల మన్యంలో వర్షాలు అధికంగా పడటంతో అల్లం పంట దెబ్బతింది. దీంతో దిగుడులు తగ్గి డిమాండ్ ఏర్పడింది. జూన్, జులై నెలల్లో అల్లం ధర కేజీ రూ.150 ఉండగా ఆ తరువాత కేజీ రూ.120 నుంచి రూ.130కి తగ్గింది. ప్రస్తుతం చింతపల్లిలో కేజీ రూ.200కు విక్రయిస్తున్నారు. త్వరలో కొత్త అల్లం మార్కెట్లోకి వస్తుంది. ఇది వస్తే ధరలు తగ్గే అవకాశం ఉంది.