News June 13, 2024
సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకి మంత్రి గుమ్మడి సంధ్యారాణి పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నివాసంలో మంత్రి సంధ్యారాణి మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. శాఖలు కేటాయించిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని సీఎం చంద్రబాబు మంత్రిని సూచించారు.
Similar News
News October 31, 2025
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు: VZM DMHO

PC & PNDT చట్టం ప్రకారం లింగ నిర్ధారణ నిషేధమని, ప్రతి స్కానింగ్ సెంటర్ తప్పనిసరిగా వివరాలు నమోదు చేసి సమర్పించాల్సిందేనని DMHO డా. జీవన రాణి తెలిపారు. DMHO కార్యాలయంలో జరిగిన సలహా మండలి సమావేశంలో ఆమె మాట్లాడుతూ..ప్రభుత్వానికి చెందిన 22 స్కానింగ్ సెంటర్లతో పాటు ప్రైవేట్ రంగంలో మరో 102 సెంటర్లు జిల్లాలో పనిచేస్తున్నాయని చెప్పారు. లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 31, 2025
VZM: పాడుబడిన ఇంటి గోడ కూలి వృద్ధురాలి మృతి

విజయనగరం పట్టణ పరిధి గోకపేట రామాలయం పక్కన పాడుబడిన ఇంటి గోడ కూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. మృతురాలు రెయ్యి సన్యాసమ్మ కుమారుడు కాళీ ప్రసాద్ వివరాల ప్రకారం.. ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్తుండగా దారిలో పాడుబడిన ఇంటి గోడ కూలి మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అదితి ఘటనా స్థలికి వెళ్లారు.
News October 31, 2025
వారణాసిలో సిక్కోలు వాసులు గాయపడడం బాధాకరం: మంత్రి

వారణాసి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది గాయపడిన ఘటన బాధాకరమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. యూపీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని శ్రీకాకుళం అధికారులను ఆదేశించామన్నారు. గాయపడిన వారు కోలుకున్న వెంటనే స్వస్థలాలకు తిరిగి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.


