News April 7, 2025

సీఎం చంద్రబాబుకే సాధ్యం: హోం మంత్రి అనిత

image

వృద్ధిరేటులో ఏపీ రెండో స్థానంలో నిలిచినట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ‘ఎక్స్’లో పేర్కొన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో విధ్వంసం అయిన అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతూ ఏడాది తిరగకుండానే కూటమి ప్రభుత్వం ఈ రికార్డు సాధించిందని అన్నారు. అభివృద్ధితోపాటు వృద్ధిరేటు సాధించడంలో ప్రపంచమంతా ఏపీ వైపు చూసేలా చేయడం విజనరీ సీఎం చంద్రబాబుకే సాధ్యం అన్నారు.

Similar News

News October 30, 2025

TU: గెస్ట్ ఫ్యాకల్టీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

image

తెలంగాణ విశ్వవిద్యాలయంలోని లా కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా చేరడానికి నియామక చేపట్టినట్లు లా కళాశాల ప్రిన్సిపల్ ప్రసన్నరాణి తెలిపారు. LLM/ML లేదా సరిసమాన విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. నవంబర్ 1న మధ్యాహ్నం 2 గంటలకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా కాలేజీలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో సందర్శించాలన్నారు.

News October 30, 2025

కాగజ్‌నగర్: సైబర్ నేరగాడి అరెస్ట్

image

కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆన్ లైన్ ద్వారా రూ.45790 పోగొట్టుకొని ఫిర్యాదు చేసినట్లు CI కుమారస్వామి తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు D-4C బృందం ద్వారా సాంకేతిక ఆధారాలను సేకరించి MPకి చెందిన ఆశిష్ కుమార్ దోహార్‌ను పట్టకున్నారు. అతడి ఖాతాలోని రూ.34537.38 ఫ్రీజ్ చేసినట్లు CI వెల్లడించారు.

News October 30, 2025

దక్షిణాఫ్రికా సిరీస్‌కు శ్రేయస్ దూరం?

image

టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ మరో 2 నెలలపాటు కాంపిటీటివ్ క్రికెట్‌కు దూరమయ్యే అవకాశం ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో నవంబర్, డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే 3 మ్యాచుల వన్డే సిరీస్‌కు ఆయన దూరం కానున్నట్లు తెలుస్తోంది. జనవరిలో న్యూజిలాండ్ జరిగే ODI సిరీస్ నాటికి ఫిట్‌నెస్ సాధించే ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో క్యాచ్ అందుకుంటూ ఆయన గాయపడిన సంగతి తెలిసిందే.