News July 31, 2024

సీఎం చంద్రబాబుతో అమెరికాకు చెందిన ఆర్థిక వేత్త భేటీ

image

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో అమెరికాకు చెందిన నోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థిక వేత్త ప్రొఫెసర్ మైఖేల్ క్రేమర్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనను సత్కరించారు. అనంతరం విద్య, వైద్యం, వ్యవసాయం, నీటి పారుదల రంగాలపై ఇద్దరు చర్చించారు. గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీటి సరఫరాపై మైఖేల్ క్రేమర్ అనుభవాన్ని వినియోగించుకోవాలని ఏపీ సర్కార్ భావిస్తోన్నట్లు సమాచారం. 

Similar News

News October 14, 2024

కామన్వెల్త్ పోటీల్లో మంగళగిరి యువతికి 4 పతకాలు

image

ఈనెల 4 నుంచి 13వ తేదీ వరకు సన్ సిటీ, సౌత్ ఆఫ్రికా దేశంలో జరిగిన కామన్ వెల్త్ పవర్ లిఫ్టింగ్ సబ్ జూనియర్, జూనియర్ పోటీల్లో మంగళగిరికి చెందిన షేక్ సాదియా అల్మాస్ జూనియర్ 57 కిలోలు విభాగంలో బంగారు పతకం సాధించారు. స్క్వాట్ -185 కిలోల బంగారు పతకం, బెంచ్ ప్రెస్ 95 కిలోల బంగారు పతకం, డెడ్‌లిఫ్ట్ 180 కిలోలు బంగారు పతకం, ఓవర్ల్ 460 కిలోలు బంగారు పతకం, ఓవరాల్ గా నాలుగు బంగారు పతకాలు సాధించారు.

News October 14, 2024

యువగళం పాదయాత్రలోని మరో హామీని నెరవేర్చా: లోకేశ్

image

యువగళం పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేర్చినట్లు మంత్రి లోకేశ్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని బోయ, వాల్మీకి సోదరులు పాదయాత్రలో తనను కలిసి విన్నవించారన్నారు. వారి సెంటిమెంట్‌ను గౌరవిస్తూ వాల్మీకి జయంతిని ఈనెల 17వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు లోకేశ్ తెలియజేశారు.

News October 13, 2024

చిలకలూరిపేటలో జాబ్‌మేళా..1000 పైగా ఉద్యోగాలు

image

చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడులోని యువత కోసం ఈనెల 19వ తేదీన మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేటలోని ప్రత్తిపాటి గార్డెన్స్‌లో ఉదయం 9 గంటల నుంచి మేళా ప్రారంభమవుతుందన్నారు. 30కి పైగా కంపెనీలు, 1000కి పైగా జాబ్‌ ఆఫర్లతో ఈ జాబ్‌ మేళా జరుగుతుందన్నారు. 2016-2024 మధ్య 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, బీటెక్, ఎంటెక్‌ చేసిన వారంతా అర్హులేనని అన్నారు. Shareit