News September 12, 2024

సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం భేటీ

image

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఊహించని విపత్తు తలెత్తి అపార నష్టాన్ని కలిగించిందని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకునేందుకు ఉదారత చూపాలని సీఎం కోరారు. వరద నష్టాలపై అంచనాల కోసం ఏర్పాటైన కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది. అనంతరం గురువారం సచివాలయంలో వారు సీఎంతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని గుర్తించి ఉదారంగా సాయం చేయాలని సీఎం కోరారు.

Similar News

News October 5, 2024

గుంటూరు: ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (ఇయర్ ఎండ్) వన్ టైం ఆపర్చ్యూనిటీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫీజు చెల్లింపు గడువు అక్టోబర్ ఒకటితో ముగియగా ఆ గడువును ఈ నెల 30 వరకు పొడిగించామని వర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా ఈ నెల 30లోపు ఫీజు చెల్లించాలని సూచించింది.

News October 5, 2024

పట్టభద్రులు ఓటర్లుగా దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్ నాగలక్ష్మి

image

ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పట్టభద్రులందరూ ఓటర్లగా నమోదు చేసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి కోరారు. శుక్రవారం, కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గములో ఓటర్ల నమోదుకు అర్హులైన వారు www.ceoandhra.nic.in వెబ్ సైటు ద్వారా ఫారం- 18 సమర్పించాలన్నారు. నవంబరు 23, 2024 న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తామని చెప్పారు.

News October 4, 2024

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: మంత్రి నారా లోకేశ్

image

తిరుమల లడ్డూ ఘటనపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు Xలో ట్వీట్ చేశారు. సత్యం గెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్‌ఎస్ఎస్‌ఏఐ నుంచి ఒక సీనియర్‌ అధికారి ఉండాలని ధర్మాసనం పేర్కొంది.