News June 18, 2024
సీఎం చంద్రబాబుతో సుగవాసి భేటీ

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో రాజంపేటలో టీడీపీ తరఫున పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రమణ్యం మంగళవారం ఉండవల్లిలో భేటీ అయ్యారు. రాజంపేట నియోజకవర్గంలో తన ఓటమికి గల కారణాలను చంద్రబాబుకు సుగవాసి వివరించారు. రాజంపేటను జిల్లా చేయడం, మెడికల్ కాలేజ్, అన్నమయ్య ప్రాజెక్ట్ తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
Similar News
News September 17, 2025
బద్వేల్: దొంగనోట్ల మార్పిడి.. ఐదుగురికి జైలు శిక్ష

దొంగ నోట్ల మార్పిడి కేసులో ఐదుగురు ముద్దాయిలకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ బద్వేలు జడ్జి పద్మశ్రీ మంగళవారం తీర్పునిచ్చారు. SI మహమ్మద్ రఫీ మాట్లాడుతూ.. సిద్దవటం మండలంలోని మాధవరం-1లోని ఓ వైన్ షాపులో 2010లో కర్నూలు జిల్లా బనగానపల్లెకు చెందిన మాధవరెడ్డి, షర్ఫుద్దీన్, వెంకటేశ్వర్లు, అల్తాఫ్, హుస్సేన్ వలిలు వెయ్యి రూపాయల దొంగ నోటు చలామణి చేయగా కేసు నమోదైంది.
News September 17, 2025
జమ్మలమడుగు: వయోవృద్దులకు న్యాయం చేసిన RDO

తమ జీవితకాలంలో సంపాదించిన ఆస్థిని వారసులకు దానంచేసి, చిత్రహింసకు గురవుతున్న వయోవృద్ధులకు జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ న్యాయం చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చియ్యపాడుకు చెందిన కృష్ణారెడ్డి జమ్మలమడుగుకు చెందిన బాలమ్మ, దువ్వూరుకు చెందిన మహమ్మద్ గౌస్లు తమ ఆస్థిని వారసులకు రాసిచ్చారు. వారసులు పోషణను పట్టించుకోకపోవడంతో బాధితులు ఆర్డీఓను ఆశ్రయించారు. RDO ఆస్తి తిరిగి పెద్దలకు వచ్చేలా చేశారు.
News September 16, 2025
కడప: మెగా DSC.. 32 పోస్టులు ఖాళీ

మెగా DSCకి సంబంధించి తుది ఎంపిక జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. ఉమ్మడి కడప జిల్లాలో 712 పోస్టులకు గాను 680 పోస్టులు భర్తీ అయినట్లు విద్యాశాఖ తెలిపింది. వివిధ కారణాల చేత మిగిలిన పోయిన 32 పోస్టులను వచ్చే DSCలో చేర్చనున్నారు. ఈ నెల 19న ఎంపికైన వారికి నియామకపత్రాలు అందిస్తారు. శిక్షణ తర్వాత పాఠశాలలు కేటాయిస్తామని అధికారులు తెలిపారు.