News June 18, 2024

సీఎం చంద్రబాబుతో సుగవాసి భేటీ

image

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో రాజంపేటలో టీడీపీ తరఫున పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రమణ్యం మంగళవారం ఉండవల్లిలో భేటీ అయ్యారు. రాజంపేట నియోజకవర్గంలో తన ఓటమికి గల కారణాలను చంద్రబాబుకు సుగవాసి వివరించారు. రాజంపేటను జిల్లా చేయడం, మెడికల్ కాలేజ్, అన్నమయ్య ప్రాజెక్ట్ తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

Similar News

News January 24, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.16,210
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,913
* వెండి 10 గ్రాములు ధర రూ.3,430.

News January 24, 2026

కడప: 2 బస్సులు ఢీ.. ఒకరు మృతి.!

image

మార్కాపురం జిల్లా పెద్దారికట్ల జంక్షన్ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ప్రొద్దుటూరు వాసి మృతి చెందాడు. పొద్దుటూరు నుంచి విజయవాడ వెళ్తున్న వాసవి ట్రావెల్స్ బస్సు, విజయవాడ నుంచి కనిగిరి వస్తున్న RTC బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మైదుకూరు- చిన్నయ్యగారిపల్లెకు చెందిన అన్నపురెడ్డి జనార్దన్‌రెడ్డి (55) మృతి చెందాడు. సుమారు 10 మంది గాయపడినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 24, 2026

బ్రహ్మంగారిమఠంలో రూ.139 కోట్లతో పనులు

image

బ్రహ్మంగారిమఠంలో శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రసాదం పథకం ద్వారా రూ.139కోట్లతో అభివృద్ధి పనులు చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఆధునిక హంగులతో దేవస్థానం అభివృద్ధి చెందుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.