News October 2, 2024
సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ మాగుంట
ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో CM చంద్రబాబు నాయుడును ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గృహ, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా తనను నియమించిన సందర్భంగా సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సీఎం సైతం మాగుంటకు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News October 9, 2024
పార్వతమ్మకు నివాళులర్పించిన మంత్రి స్వామి
ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీమతి మాగుంట పార్వతమ్మ దశదినం సందర్భంగా.. బుధవారం నెల్లూరులోని మాగుంట నివాసంలో పార్వతమ్మ చిత్రపటానికి మంత్రి స్వామి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్వతమ్మ ఒంగోలు పార్లమెంట్ పరిధిలో చేసిన అభివృద్ధి పనులు, ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
News October 9, 2024
తెలంగాణ డీఎస్సీలో సత్తా చాటిన తర్లుపాడు యువతి
తెలంగాణ డీఎస్సీలో తుర్లపాడుకు చెందిన సయ్యద్ రహిమున్ సత్తా చాటారు. మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించారు. దీంతో నాన్ లోకల్ కేటగిరీ కింద సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయిని (ఉర్దూ) గా ఎంపికయ్యారు. తండ్రి టైలర్ కాగా తల్లి గృహిణి. పట్టుదలతో తెలంగాణలో ఉద్యోగం సాధించడం పట్ల పలువురు ఆమెను అభినందించారు.
News October 9, 2024
పొన్నలూరు: విద్యార్థిని మృతి..నలుగురిపై వేటు
పొన్నలూరు (మం) ముళ్లమూరివారిపాలెం విద్యార్థి మైథిలి గతనెల 29న రోడ్డు ప్రమాదంలో మరణించింది. దీనికి సంబంధించి నలుగురి ఉపాధ్యాయులపై డీఈవో సుభద్ర సస్పెండ్ చేశారు. 28న బాలిక పల్నాడు జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్-19 ఫుల్ బాల్ పోటీలో పాల్గొని, 29న ఒంగోలుకు చేరుకుంది. బస్టాండు నుంచి ఓ వ్యక్తి బైకుపై వెళుతుండగా..ప్రమాదంలో కన్నుమూసింది. దీంతో క్రీడాకారుల పట్ల సరైన రక్షణ తీసుకోలేదని వేటు వేశామన్నారు.