News September 25, 2024

సీఎం చంద్రబాబుపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

image

ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్యకరంగా, దూషణలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఆగస్టు నెలలో జంగారెడ్డిగూడెంకు చెందిన ఓ టీడీపీ నాయకుడి ఫిర్యాదు మేరకు అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా దర్యాప్తు చేపట్టి.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన నిందితుడిని మంగళవారం అరెస్టు చేసి జంగారెడ్డిగూడెం తీసుకొచ్చారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, జడ్జి అతనికి రిమాండ్ విధించారు.

Similar News

News September 18, 2025

నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.. జేసీ హెచ్చరిక

image

భీమవరంలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రీ-సర్వే, పీజీఆర్ఎస్, ఇళ్ల స్థలాల కేటాయింపు వంటి అంశాలపై ఆయన సమీక్షించారు. ముఖ్యంగా పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులను స్వయంగా మాట్లాడి పరిష్కరించాలని జేసీ అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

News September 17, 2025

ఉండిలో ప్రభుత్వ భూముల పరిశీలన.. చర్యలకు కలెక్టర్ ఆదేశం

image

ఉండిలోని ప్రభుత్వ స్థలాలను జిల్లా కలెక్టర్ నాగరాణి బుధవారం పరిశీలించారు. ఉండి కూడలి డైవర్షన్ ఛానల్ వద్ద ఇరిగేషన్, పీడబ్ల్యుడీ, జడ్పీ స్థలాలను పరిశీలించిన ఆమె, ఆక్రమణలు గుర్తించి నోటీసులు జారీ చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలకు సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.

News September 17, 2025

హార్టీకల్చర్ కోర్సులకు వెబ్ ఆప్షన్లకు అవకాశం: శ్రీనివాసులు

image

తాడేపల్లిగూడెం (M) వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధి కళాశాలలో బీఎస్సీ హార్టీకల్చర్, ఫారెస్టరీ కోర్సుల్లో ప్రవేశానికి రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించినట్లు రిజిస్ట్రార్ డాక్టర్ బి. శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో నమోదు చేసుకున్న దరఖాస్తుదారులకు ఈ నెల 18వ తేదీ లోపు కాలేజీ ఎంపికకు అవకాశం కల్పించారన్నారు.