News November 18, 2024
సీఎం చంద్రబాబుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఫైర్

సీఎం చంద్రబాబుపై వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి ఫైర్ అయ్యారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని అన్నారు. కర్నూలులో హైకోర్టు, లోకాయుక్త, హెచ్ఆర్‌సీ, లా యూనివర్సిటీ ఏర్పాటుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటే.. చంద్రబాబు వాటిని అమరావతికి తరలించేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.
Similar News
News March 11, 2026
అనంత: ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన M.Tech 1-1 (R25) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్‌తో కలిసి ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు కళాశాలలోని అకడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.
News March 11, 2026
అనంత: ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన M.Tech 1-1 (R25) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్‌తో కలిసి ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు కళాశాలలోని అకాడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.
News March 11, 2026
అనంత: ఈ రోజు నుంచి ఉచితం

గర్భాశయ కాన్సర్‌ను నిర్మూలించేందుకు తగు చర్యలు చేపట్టినట్లు DMHO దేవి తెలిపారు. అనంతపురంలో ఆమె మాట్లాడుతూ.. గర్భాశయ ముఖ క్యాన్సర్ నిర్మూలనకు బాలికలకు ముందస్తుగా HPV టీకాలు బుధవారం నుంచి వేస్తామన్నారు. జిల్లాలో 14 నుంచి 15 ఏళ్ల మధ్య బాలికలు 16,449 మంది ఉన్నారన్నారు. వారికి సరిపడా డోసులు ముందస్తుగానే జిల్లాకు చేరాయన్నారు. ఒక్కో డోసు ఖరీదు రూ.3,989 కాగా వాటిని ప్రభుత్వం ఉచితంగా ఇస్తోందన్నారు.


