News April 5, 2025
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 46వ అథారిటీ సమావేశం

ఎన్టీఆర్: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 46వ అథారిటీ సమావేశం శనివారం జరిగింది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి నారాయణ, CS కె. విజయానంద్, CRDA కమిషనర్ కె.కన్నబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాజధాని పనులలో పురోగతి, అమరావతి పునః నిర్మాణ పనులకు ప్రధాని మోదీ హాజరు కానున్నందున కార్యక్రమ సన్నాహకాల గురించి చంద్రబాబు ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
Similar News
News October 17, 2025
‘హాక్ ఏపీ హ్యాకథాన్’కు రిజిస్ట్రేషన్ చేసుకోండి: ఎస్ఈ

విద్యుత్ రంగంలో సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ‘హాక్ ఏపీ హ్యాకథాన్’ నిర్వహించనున్నట్లు ఏలూరు జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ సాల్మన్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమం విశాఖపట్నంలో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక పరిష్కారాలను అందించగలిగే స్టార్టప్ సంస్థలు ఈ హ్యాకథాన్లో పాల్గొనాలని కోరారు. మరింత సమాచారం, రిజిస్ట్రేషన్ కోసం https://electronvibe.com/hackap-hackathon/ను పరిశీలించాలని సూచించారు.
News October 17, 2025
జనసేన వినూత్న కార్యక్రమం: పవన్ కళ్యాణ్

AP: రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను భాగస్వామ్యం చేసేందుకు “సేనతో సేనాని – మన నేల కోసం కలిసి నడుద్దాం” అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీని ద్వారా ఔత్సాహిక యువతీ, యువకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకుని సేవలు అందించే అవకాశాన్ని ఈ వేదిక కల్పించనుందని చెప్పారు. పూర్తి వివరాలకు జనసేన పార్టీ <
News October 17, 2025
VZM: ఏమ్మా.. దేని కోసం వచ్చారు..!

కలెక్టరేట్లో ఎంప్లాయిస్ గ్రీవెన్స్ను శుక్రవారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్.కోట మండలం రూపశ్రీ అనే దివ్యాంగురాలు మూడు చక్రాల సైకిల్తో సమస్య చెప్పుకునేందుకు తండ్రితో వచ్చింది. అటుగా వచ్చిన కలెక్టర్ ఆమెను చూసి ఏమ్మా.. దేనికోసం వచ్చారని పలకరించారు. SGTగా ఎంపిక కాగా.. పోస్టింగ్ కురుపాం మండలం ఇచ్చారని, పూర్తిగా వికలాంగురాలైన ఆమె తన సమస్యను వివరించగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.