News August 30, 2024
సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన రద్దు

సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పత్తికొండ పర్యటన రద్దయింది. వర్షాలు పడుతుండటంతో ఈ పర్యటన రద్దయినట్లు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కా రెడ్డి తెలిపారు. కాగా రేపు నంద్యాల జిల్లాలోని ఓర్వకల్లు మండలంలో సీఎం చంద్రబాబు పింఛన్ పంపిణీలో పాల్గొంటారని సమాచారం.
Similar News
News July 10, 2025
డ్రగ్స్, గంజాయి రహిత సమాజమే లక్ష్యం: ఈగల్ ఐజీ

డ్రగ్స్, గంజాయి రహిత సమాజమే మన ముందున్న లక్ష్యమని ఈగల్ ఐజీ రవికృష్ణ అన్నారు. గురువారం కప్పట్రాళ్లలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌కు ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. రవికృష్ణ మాట్లాడుతూ.. పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నారు. అనంతరం గతేడాది 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు.
News July 10, 2025
కబడ్డీ ఆడిన కర్నూలు DEO శామ్యూల్ పాల్

వెల్దుర్తిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో తల్లిదండ్రులకు ఆటల పోటీలను ఉపాధ్యాయులు నిర్వహించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య స్నేహభావాన్ని పెంపొందించే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ విద్యార్థుల తండ్రులతో కలిసి కబడ్డీ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన సూచించారు.
News July 10, 2025
ఎన్నికల ప్రక్రియలో బీఎల్‌వోల పాత్ర కీలకం: ఆర్వో

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మనదేశంలో ఎన్నికల ప్రక్రియలో బీఎల్‌వోల పాత్ర కీలకమైందని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగరపాలక కమిషనర్ రవీంద్ర బాబు అన్నారు. బుధవారం ఎస్బీఐ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో బీఎల్‌లోలకు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికల సమయంలో బీఎల్‌వోలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఎల్ఓకు 6 రోజులు శిక్షణ ఉంటుందన్నారు.