News June 22, 2024
సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

ఈ నెల 25, 26 తేదీల్లో సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ షన్మోహన్ పరిశీలించారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెసీ శ్రీనివాసులు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 24, 2026
చిత్తూరు- తిరుపతి హైవేపై ప్రమాదం

పూతలపట్టు మండలం వడ్డేపల్లి వద్ద ఓ వ్యక్తిని టెంపో వాహనం ఢీకొట్టింది. స్థానిక బిడారమిట్టకు చెందిన టి చెంగయ్య వడ్డేపల్లి వద్ద ఓ కళ్యాణమండపంలో జరుగుతున్న తమ సమీప బంధువు వివాహానికి హాజరు కావడానికి వెళ్లాడు. ఈ క్రమంలో బస్సు దిగి రోడ్డు దాటుతుండగా టెంపో వాహనం చెంగయ్యను ఢీకొని రెండు కాళ్లపై మీదుగా వెళ్లింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 24, 2026
సదుం: అవకతవకలకు పాల్పడ్డ BPM సస్పెండ్

సదుం మండలం చెరుకువారిపల్లి బ్రాంచ్ తపాలయ కార్యాలయంలో ఓ ఉద్యోగి పలువురి ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాతాదారుల పాసుపుస్తకాలను పుంగనూరు డివిజనల్ ఇన్‌స్పెక్టర్ మోహన్ పరిశీలించారు. అవకతవకలు జరిగినట్లు నిర్ధారించి BPM ధనలక్ష్మిని సస్పెండ్ చేశారు. మొత్తం ఖాతాలను పరిశీలించేందుకు కొద్ది రోజుల సమయం పడుతుందన్నారు.