News December 2, 2024
సీఎం చంద్రబాబు గొప్ప మనసు.. కళ్యాణదుర్గం చిన్నారికి అండ!

కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన లిఖిత అనే చిన్నారికి సీఎం చంద్రబాబు నాయుడు అండగా నిలిచారు. చిన్నారి తీవ్ర అనారోగ్యంతో బెంగళూరులో చికిత్స పొందుతున్న విషయాన్ని ఎమ్మెల్యే సురేంద్రబాబు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల నేమకల్లు పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి రూ.10 లక్షల నిధులను మంజూరు చేశారు. బాధితులు సీఎం, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News February 8, 2026
రేపు పీజీఆర్ఎస్ రద్దు: అనంత కలెక్టర్

ఈనెల 9న (సోమవారం) అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం చంద్రబాబు నిర్వహించే మంత్రులు, సెక్రటరీలు, హెచ్ఓడిల కాన్ఫరెన్స్ కారణంగా గ్రీవెన్స్‌ను రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు గమనించాలి సూచించారు.
News February 8, 2026
నేడు అనంతలో చికెన్, మటన్ ధరలు ఇలా

అనంతపురం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గుత్తిలో కేజీ చికెన్ రూ.200, స్కిన్ లెస్ రూ.220, అనంతపురంలో రూ.200, స్కిన్ లెస్ రూ.210 గుంతకల్లులో రూ.200, స్కిన్లెస్ రూ.210 విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకులు తెలిపారు. కేజీ మటన్ ధరలో రూ.750 ఎలాంటి మార్పు లేదన్నారు. ఒక్కసారి ఇక చికెన్ ధరలు తగ్గడంతో మాంసం ప్రియులు హర్షం వ్యక్తం చేశారు.
News February 8, 2026
ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో నిర్వహించనున్న ఏపీపీఎస్సీ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏపీపీఎస్సీ ఛైర్మన్ శశిధర్ తెలిపారు. శనివారం అనంతపురం కలెక్టరేట్ ట్రెజరీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను ఆయన పరిశీలించారు. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు 5 రోజుల పాటు 4 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్, ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.


