News August 8, 2024
సీఎం చంద్రబాబు చీర కొన్నది.. మన కాకినాడ వ్యక్తి దగ్గరే.!

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా యు.కొత్తపల్లికి చెందిన చేనేత కార్మికుడు మల్లెల నాగేంద్ర ఉప్పాడ చేనేత చీరలతో విజయవాడలో స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నాగేంద్ర వద్ద రూ.20వేలకు ఉప్పాడ చీరను కొనుగోలు చేశారు.
Similar News
News November 7, 2025
డిజిటల్ సేవలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

తూ.గో. జిల్లా వ్యాప్తంగా ‘మన మిత్ర’ వాట్సాప్ ఆధారిత సేవలపై శుక్రవారం నుంచి డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వాట్సాప్ సేవల డెమో, క్యూఆర్ కోడ్ పంపిణీ, పాంప్లెట్లు ఇవ్వాలని ఆమె ఆదేశించారు. ప్రతి ఇంటిని కవర్ చేసి, నమోదు అయిన కుటుంబాల వివరాలను రికార్డు చేయాలని కలెక్టర్ సూచించారు.
News November 7, 2025
‘వందేమాతరం గీతం’ వార్షికోత్సవం నిర్వహించాలి: కలెక్టర్

దేశభక్తి గీతం వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 7న జిల్లా వ్యాప్తంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 2025 ప్రకారం, జిల్లా వ్యాప్తంగా అన్ని డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో ఒకే సమయంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఆమె అధికారులకు సూచనలు జారీ చేశారు.
News November 7, 2025
రిజర్వ్ ఫారెస్ట్లో నగర వనం: డీఎఫ్వో

జాతీయ రహదారిని ఆనుకుని దివాన్ చెరువులోని రిజర్వ్ ఫారెస్ట్ లో 125 ఎకరాల విస్తీర్ణంలో రూ.రెండు కోట్లు వ్యయంతో నగరవనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్కిటెక్ట్ గౌరీ శంకర్తో కలిసి ఫారెస్ట్ డీఎఫ్ఓ ప్రభాకరరావు గురువారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. వచ్చే పుష్కరాలు నాటికి ఇది సిద్ధమవుతుందని డీఎఫ్ఓ తెలిపారు.


