News October 5, 2024
సీఎం చంద్రబాబు తిరుమల పర్యటనలో స్వల్ప మార్పు
శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు తిరుమలకు వచ్చిన సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం వకుళమాత నూతన కేంద్రీకృత వంటశాలను ప్రారంభించి తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. అయితే టీటీడీ అధికారులతో సమావేశం అయి తర్వాత తిరుగు ప్రయాణం కానున్నారు. లడ్డూ వ్యవహారం అనంతరం సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
Similar News
News November 3, 2024
3 ఉచిత సిలిండర్లు అందజేయడం ఎంతో సంతోషం: మంత్రి నాదెండ్ల
దీపం – 2 పథకం అమలు ద్వారా పేద మహిళలకు భరోసా కల్పించేలా సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శనివారం తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ..పేదల సమస్యలు అర్థం చేసుకున్న మన కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, DY.CM పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేయాలని నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.
News November 2, 2024
తిరుపతి: హోంమంత్రి రెండు రోజుల పర్యటన వివరాలు
హోం మంత్రి తిరుపతి జిల్లాలో 2 రోజులు పర్యటించనున్నారు. 3న మధ్యాహ్నం 12.05 కు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొనున్నారు. 12.35 నుంచి 1.30 గంటల వరకు అలివేలు మంగాపురం గ్రామంలో పర్యటించనున్నారు. 3.10 గంటలకు పద్మావతి మహిళా యూనివర్సిటీలో అనంతపురం డీఐజీతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోన్నారు. 11 కు అలిపిరి కపిల తీర్థం ఆలయం దర్శించనున్నారు.
News November 2, 2024
తిరుపతిలో బాలికపై అత్యాచారం.. యువకుడు అరెస్ట్
తిరుపతిలోని ఓ ప్రైవేటు లాడ్జిలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత బాలిక 9వ తరగతి చదువుతోంది. వెస్ట్ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన సతీష్(22) చెన్నైలోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. ఇతనికి అన్లైన్ ద్వారా బాలిక పరిచయమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో అతనిపై అలిపిరి పోలీసులు కేసు నమోదుచేసి రిమాండు తరలించారు.