News November 25, 2024
సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే.!
సీఎం చంద్రబాబు సోమవారం షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరి వెలగపూడి సచివాలయానికి వెళతారు. అక్కడ సీఆర్డీఏపై రివ్యూ చేస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మున్సిపల్ శాఖపై సమీక్ష చేస్తారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల మరమ్మతులపై చంద్రబాబు రివ్యూ చేయనున్నట్లు తెలిపారు.
Similar News
News December 6, 2024
విడదల రజినిపై పోలీసులకు ఫిర్యాదు
మాజీ మంత్రి విడదల రజిని దళిత రైతుల భూములు లాక్కున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈక్రమంలో యడవల్లికి చెందిన దళిత రైతులు చిలకలూరిపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి విడదల రజిని తమను మభ్యపెట్టి విలువైన గ్రానైట్ ఉన్న తమ భూములను లాక్కున్నారని వాపోయారు. వారిద్దరిపై కేసు నమోదు చేయాలని కోరారు.
News December 6, 2024
తెనాలిని జిల్లా కేంద్రంగా మార్చాలి: సత్యకుమార్
తెనాలిని జిల్లా కేంద్రంగా మార్చాలని కొల్లూరుకు విచ్చేసిన రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, మాజీ మంత్రి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబులకు కొల్లూరు మండలం టీడీపీ సీనియర్ నేత వెంకట సత్యకుమార్ వినతిపత్రం అందజేశారు. అదే విధంగా గాజుల్లంక శ్రీకాకుళం మధ్య కాజ్వే నిర్మించాలని, 75 ఎకరాలలో మూతబడి ఉన్న జంపని షుగర్ ఫ్యాక్టరీని మెడికల్ కాలేజీగా మార్చాలని కోరారు.
News December 5, 2024
జగన్ మరో నాటకానికి సిద్దమౌతున్నారు: బాలాజీ
అసెంబ్లీకి వెళ్లకుండా వీధి నాటకాలు ఆడిన వైసీపీ అధినేత జగన్ మరో నాటకానికి సిద్దమౌతున్నారని జనసేన సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ బాలాజి అన్నారు. గురువారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. జగన్ ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్దమౌతున్నట్లు ప్రకటించారని, దీని ద్వారా కూటమి ప్రభుత్వంపై బురదజల్లుడు కార్యక్రమాన్ని కొనసాగించనున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.