News April 29, 2024

సీఎం జగన్ నేటి పొన్నూరు పర్యటన వివరాలు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు పొన్నూరుకు వస్తున్నారు. పి. గన్నవరం నుంచి హెలికాఫ్టర్‌లో మధ్నాహ్నం 3 గంటలకు స్థానిక జీబీసీ రహదారిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుంటారు. ఎన్నికల ప్రసంగం ముగించుకుని సాయంత్రం 5.30 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుని తాడేపల్లికి వెళ్తారు.

Similar News

News April 21, 2025

గుంటూరు: పరీక్షల షెడ్యూల్ విడుదల

image

అచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎం.ఎడ్. నాల్గవ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ ను సోమవారం విడుదల చేసింది. పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ఉదయం 10:30 నుంచి 1:30 వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు. ప్రతి పేపరు 70 మార్కులకు ఉంటుంది. ముఖ్యమైన సబ్జెక్టులుగా టీచర్ ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, హ్యూమన్ రైట్స్, వాల్యూ ఎడ్యుకేషన్ ఉంటాయి. విద్యార్థులు పరీక్ష తేదీలను గమనించాలని సూచించారు.

News April 21, 2025

వినుకొండ: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి

image

వినుకొండలో క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. శనివారం క్రికెట్ ఆడుతుండగా గౌస్ బాషా (చంటి) అనే యువకుడు గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, కొద్దిసేపటికే మృతి చెందాడు. మూడేళ్ల క్రితమే వివాహమైన చంటి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానికంగా కలచివేసింది. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భౌతికకాయానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

News April 21, 2025

జర్మన్ యువకుడిని పెళ్లాడిన మంగళగిరి యువతి

image

మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన మౌనిక జర్మనీలో PHD చేస్తూ ఉద్యోగం చేస్తుంది. అక్కడే పనిచేస్తున్న జర్మన్ యువకుడు ఫాబియన్ డువెన్ బేక్‌తో పరిచయం ప్రేమగా మారింది. ఇరువురి తల్లిదండ్రుల అంగీకారంతో వీరి వివాహం ఆదివారం పెదవడ్లపూడిలో ఘనంగా జరిగింది. మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ దంపతులు వధూవరులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

error: Content is protected !!