News March 18, 2025

సీఎం తిరుపతి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

image

సీఎం చంద్రబాబు ఈనెల 20, 21వ తేదీల్లో తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. 20వ తేదీ తిరుపతి మీదుగా తిరుమల చేరుకుంటారు. 21వ తేదీ శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. రేణిగుంట విమానాశ్రయంలో అధికారులతో సమీక్షించారు. సీఎం పర్యటనలో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలను అధికారులకు వివరించారు.

Similar News

News November 2, 2025

BREAKING: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

image

AP: రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌ల బదిలీలు, నియామకాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్‌గా మణికంఠ చందోలు, విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్‌గా కృష్ణకాంత్ పటేల్, సైబర్ క్రైమ్ సీఐడీ ఎస్పీగా అదిరాజ్ సింగ్ రాణా, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీనివాసరావు, ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా ఈజీ అశోక్ కుమార్‌ తదితరులను బదిలీలు, నియామకాలు చేశారు.

News November 2, 2025

కొనసాగుతున్న కరీంనగర్ అర్బన్ ఎన్నికల కౌంటింగ్

image

కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అర్ధరాత్రి వరకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 వరకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. 12 డైరెక్టర్ స్థానాలకు 54 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పటిష్ట భద్రతా మధ్య కౌంటింగ్ కొనసాగుతుంది. అధికారులు పారదర్శకంగా లెక్కింపు చేపడుతున్నారు.

News November 2, 2025

జానపద కళాకారుల సంక్షేమంపై కవిత హామీ

image

జానపద కళాకారుల సంక్షేమంపై కరీంనగర్‌లో జరిగిన ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. కళాకారులను ప్రభుత్వం గుర్తించి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వారికి వేతనాలు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. జానపద సంప్రదాయాన్ని నిలబెట్టిన కళాకారులకు కళాభివందనం చేసిన కవిత, హక్కుల కోసం అందరూ కలిసి పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.