News January 18, 2026

సీఎం పర్యటనకు ఇందిరమ్మ చీరలతో రాకుంటే జరిమానా!

image

మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనకు డ్వాక్రా మహిళా సంఘాలను రావాల్సిందిగా అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల పంపిణీ చేసిన ఇందిరమ్మ చీరలతో సీఎం పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా ఉండాలని లేకుంటే రూ.500, రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. బలవంతంగా పనులు వదిలేసి తాము ఎలా వెళ్లాలని మహిళా సంఘాలు సతమతమవుతున్నారని సమాచారం.

Similar News

News February 18, 2026

VJA: తలశిల చంద్రశేఖర్‌రావు మృతికి జగన్ సంతాపం

image

ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ తండ్రి తలశిల చంద్రశేఖర్‌రావు (88) మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు YS జగన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. గొల్లపూడిలోని తలశిల రఘురామ్ నివాసానికి వెళ్లిన జగన్, చంద్రశేఖర్ రావు భౌతిక కాయానికి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

News February 18, 2026

చంద్రబాబు వదిలిపెట్టరనే భయంతోనే ఆత్మహత్యలు: TDP

image

AP: మదనపల్లెలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో SMలో TDP ఆసక్తికర పోస్ట్ పెట్టింది. 2018 దాచేపల్లి నుంచి నేటి మదనపల్లె ఘటన వరకు ఆడబిడ్డల జోలికి వెళ్లిన నిందితులు వరుసగా ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొంది. నేరం చేస్తే చంద్రబాబు వదిలిపెట్టరనే భయమే వారిని వెంటాడిందని, అందుకే ప్రాణాలు తీసుకున్నారని రాసుకొచ్చింది.

News February 18, 2026

మామునూర్‌లో ఫ్లయింగ్ క్లబ్ ఏర్పాటుకు అవకాశం

image

వరంగల్ మామునూరు విమానాశ్రయంలో ఫ్లయింగ్ క్లబ్ ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెలలో విమానాశ్రయ పునరుద్ధరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలో విమానయాన శిక్షణకు అడుగులు పడటం వల్ల మంచి పరిణామం. ఫ్లయింగ్ క్లబ్ ఏర్పాటు ద్వారా పైలట్ ట్రైనింగ్, ఏవియేషన్ టెక్నికల్ కోర్సులు, గ్రౌండ్ స్టాఫ్ శిక్షణ వంటి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.