News July 31, 2024

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

నంద్యాల కలెక్టర్ రాజకుమారి మంగళవారం శ్రీశైలం చేరుకున్నారు. ఆగస్టు 1న సీఎం చంద్రబాబు శ్రీశైలం వస్తున్న సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. డ్యామ్ అధికారులతో పలు విషయాలపై చర్చించారు. వారితో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ఆత్మకూరు ఆర్డీవో దాస్, జిల్లాస్థాయి అధికారులు, పోలీసు అధికారులు, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 17, 2025

సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం: మంత్రి టీజీ

image

పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. కర్నూలులోని జగన్నాథగుట్ట ఎన్టీఆర్ కాలనీలో సోమవారం 187 టిడ్కో గృహాలను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కర్నూలులో 10 వేల టిడ్కో ఇళ్ల పూర్తికి రూ.18 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. తొలి దశలో 187 గృహాలు అందించగా, మార్చి 31 నాటికి మొత్తం ఇళ్ల పనులు పూర్తిచేస్తామని ప్రకటించారు.

రీ-ఓపెన్ అర్జీదారులతో కలెక్టర్ సంభాషణ

image

ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి వచ్చిన రీ-ఓపెన్ అర్జీలపై కర్నూలు కలెక్టర్ డా. ఎ. సిరి సోమవారం స్వయంగా అర్జీదారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల వివరాలు తెలుసుకున్నారు. అర్జీల పరిశీలన, ఎండార్స్‌మెంట్ల అందజేత, భూమి సంబంధించిన అంశాలలో ఫీల్డ్ విజిట్ జరిగిందా అనే విషయాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదు పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.