News January 28, 2025
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

ఈనెల 31న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెనుగొండలో పర్యటించనున్నారు. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, జెసి రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. పెనుగొండ నగరేశ్వర, మహిషాసురమర్దిని శ్రీ వాసవికన్యకా పరమేశ్వరి అమ్మ వారి దేవస్థానంలో జరిగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు.
Similar News
News December 9, 2025
ప.గో జిల్లా ప్రజలారా.. ఈ నెంబర్లు సేవ్ చేసుకోండి

ఉమ్మడి ప.గో జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, అవినీతికి పాల్పడినట్లు తెలిసినా, ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. ఏసీబీ డీఎస్పీ 9440446157, సీఐలు 9440446158, 9440446159, టోల్ ఫ్రీ 1064కు ఫిర్యాదు చేయవచ్చాన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. (నేడు అంతర్జాతీయ అవినీతి నిరోధక దినం)
News December 9, 2025
ఈ కమిషనర్ మాకొద్దు: నరసాపురం కౌన్సిల్ ఫిర్యాదు

నరసాపురం మున్సిపల్ కమిషనర్ అంజయ్యను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని మునిసిపల్ చైర్పర్సన్ బర్రె శ్రీ వెంకట రమణతో పాటు వైసీపీ కౌన్సిల్ సభ్యులు జేసీ రాహుల్ కుమార్ రెడ్డికి PGRSలో ఫిర్యాదు చేశారు. అభివృద్ధి పనులకు కౌన్సిల్ తీర్మానం చేసినా పట్టించుకోవట్లేదని, అవినీతి ఆరోపణలు వంటి కారణాల వల్ల ఆయనను సరెండర్ చేయాలని కౌన్సిల్ తీర్మానించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తీర్మాన పత్రాన్ని జేసీకి అందించారు.
News December 9, 2025
ప.గో జిల్లా మొత్తం 8 పరీక్షా కేంద్రాలు

డిసెంబర్ 10 నుంచి 21 వరకు జరిగే టెట్(TET) పరీక్షల కోసం జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. భీమవరం 5, నరసాపురం 1, తాడేపల్లిగూడెంలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 12,985 మంది అభ్యర్థులు హాజరవుతారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.


