News January 28, 2025

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ 

image

ఈనెల 31న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెనుగొండలో పర్యటించనున్నారు. ఏర్పాట్లను  జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, జెసి రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. పెనుగొండ నగరేశ్వర, మహిషాసురమర్దిని శ్రీ వాసవికన్యకా పరమేశ్వరి అమ్మ వారి దేవస్థానంలో జరిగే  శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు. 

Similar News

News February 14, 2025

ఏలూరులో వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్

image

ఏలూరులో ఈనెల 11న టూటౌన్ సీఐ వైవీ రమణ ఎన్ ఆర్ పేటలోని ఓవర్ బ్రిడ్జి కింద ఉన్న ఎస్ఎస్ బ్యూటీ యునిసెక్స్ బ్యూటీ పార్లర్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించి నిర్వాహకులు నాగార్జున, అతని భార్య శివదుర్గ, దివ్య, భాను ప్రకాశ్, నరేంద్రపై కేసు నమోదు చేశారు. నాగార్జున, శివదుర్గ, దివ్యలను కోర్టులో హాజరుపరచగా..14 రోజులు రిమాండ్ విధించారు. భాను ప్రకాశ్, నరేంద్ర పరారీలో ఉన్నారు.

News February 13, 2025

ఏలూరు : విద్యార్థులతో టీచర్ అసభ్య ప్రవర్తన

image

ఏలూరు రూరల్ మండలంలోని సత్రంపాడు జెడ్పీ హైస్కూలులో సోషల్ స్డడీస్ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో వెంకటలక్ష్మి బుధవారం రాత్రి తెలిపారు. ఇటీవల గుడ్ టచ్- బ్యాడ్ టచ్ పై విద్యార్థులకు అభయ మహిళా రక్షక బృందం అవగాహన కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థులు వారికి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపి టీచర్ సాల్మన్ రాజును సస్పెండ్ చేస్తామన్నారు. కాగా ఆయన మరో ఏడాదిలో రిటైర్ అవ్వనున్నారు.

News February 13, 2025

ఉంగుటూరులో బర్డ్ ఫ్లూ

image

బర్డ్ ఫ్లూపై ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి కీలక ప్రకటన చేశారు. ఉంగుటూరు(M) బాదంపూడిలోని ఓ పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణైనట్లు తెలిపారు. దీంతో బాదంపూడి పౌల్ట్రీ నుంచి కిలీమీటురు పరిధి వరకు రెడ్ జోన్, పది. కి.మీ పరిధిని సర్వేసెన్స్ జోన్ గా ప్రకటించినట్లు తెలిపారు.

error: Content is protected !!