News November 19, 2024

సీఎం పర్యటన.. గ్రేటర్ వరంగల్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు

image

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ కారణంగా ఆంక్షలు ఉన్నాయని, వాహనదారులు అవసరం ఉంటే తప్ప తమ వాహనాలను రోడ్డు పైకి తీసుకరావద్దని సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. ముఖ్యంగా బహిరంగ సభ జరిగే ఆర్ట్స్ కాలేజీ పరిసరాల వద్ద కఠినమైన ఆంక్షలు ఉంటాయన్నారు. ఈ ట్రాఫిక్ మళ్లింపు ఆంక్షలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం సమావేశం ముగిసే వరకు కొనసాగుతుందన్నారు.

Similar News

News December 13, 2024

సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన మంత్రి కొండా

image

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సభ్యుల శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా పర్యాటక భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తారామతి బారాధారిలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు మంత్రి కొండా సురేఖ హాజరై కార్యక్రమాలను తిలకించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కార్యక్రమంలో పాలుపంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి కొండా సురేఖ తెలిపారు.

News December 12, 2024

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్ల బదిలీలు

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లు, ఇతర విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషన్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఐదుగురు హెడ్ కానిస్టేబుళ్లు, పది మంది కానిస్టేబుళ్లు ఉన్నారు.

News December 12, 2024

అరెస్టు చేయడం దుర్మార్గం: కేటీఆర్

image

గిరిజన హాస్టల్‌లో విషాహార బాధిత పిల్లలను పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పార్టీ సీనియర్ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని సిరిసిల్ల MLA KTR ట్వీట్ చేశారు. ప్రభుత్వ బాధ్యతను గుర్తుచేస్తున్న ప్రతిపక్షాన్ని అడ్డుకోవడం కాకుండా, పసిబిడ్డలకు పోషకాహారం అందించడం, సరైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టడం మంచిదన్నారు.