News November 30, 2024

సీఎం పర్యటన విజయవంతం: ఎస్పీ

image

బొమ్మనహళ్ మండలం నేమకల్లులో జరిగిన సీఎం చంద్రబాబు బహిరంగ సభ విజయవంతమైనట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. పోలీస్ సిబ్బంది అన్ని రకాల భద్రత చర్యలు చేపట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారన్నారు. శాంతి భద్రతలు నిర్వహించిన సిబ్బందికి ,విఘాతం కలగకుండా సహకరించిన ప్రజానీకానికి ఎస్పీ, డీఐజీ కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News December 7, 2024

‘13న రైతు సమస్యలపై భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం’

image

ఉమ్మడి అనంత జిల్లాలో రైతుల సమస్యలపై ఈనెల 13న ఉదయం 10 గంటలకు అనంతపురంలోని జడ్పీ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహం నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్నట్లు కళ్యాణదుర్గం YCP ఇన్‌ఛార్జ్ తలారి రంగయ్య తెలిపారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులను పాల్గొనాలని పిలుపునిచ్చారు.

News December 7, 2024

అనంతపురాన్ని రెండో రాజధానిగా ప్రకటించాలి: పోతుల నాగరాజు

image

రాయలసీమ అభివృద్ధి జరగాలంటే అనంతపురాన్ని రాష్ట్రానికి రెండో రాజధానిగా ప్రకటించాలని ఆర్‌పీఎస్ వ్యవస్థాపకుడు డా.పోతుల నాగరాజు డిమాండ్ చేశారు. శనివారం అనంతపురంలో ఆయన మాట్లాడారు. వెనుక బడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటే వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రెండో రాజధానిగా అనంతపురాన్ని ప్రకటించాలని సంచలన డిమాండ్ చేశారు.

News December 7, 2024

ATP: కాసేపట్లో పెళ్లి.. వధువు బంగారు దొంగిలించిన బ్యూటీషియన్!

image

వధువుకు చెందిన 28 తులాల బంగారు నగలను బ్యూటీషియనే మాయం చేసింది. ఈ ఘటన పామిడిలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. రామరాజుపల్లికి చెందిన యువతి వివాహ రిసెప్షన్ గురువారం ఘనంగా జరిగింది. శుక్రవారం ఉదయం తలంబ్రాలు. ఈ క్రమంలో ఆమెకు చెందిన బంగారు మాయమైంది. దిక్కుతోచని స్థితిలో వేరే నగలతో పెళ్లి కార్యక్రమం పూర్తి చేశారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మేకప్ చేయడానికి వచ్చిన బ్యూటీషియనే దొంగ అని తేలింది.