News March 24, 2025

సీఎం పర్యటన విజయవంతం చేయాలి: బాపట్ల కలెక్టర్

image

చినగంజాం మండలం చిన్న గొల్లపాలెం గ్రామానికి సీఎం చంద్రబాబు రానున్నారని కలెక్టర్ జె.వెంకట మురళి చెప్పారు. ఏప్రిల్ ఒకటో తేదీన సీఎం పర్యటన ఖరారు నేపథ్యంలో జిల్లా అధికారులతో సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన జయప్రదం చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, తదితరులు ఉన్నారు.

Similar News

News November 15, 2025

నాగర్ కర్నూల్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

image

జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో అమ్రాబాద్ మండలం వటవర్లపల్లిలో అత్యల్పంగా 12.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వెల్దండలో 12.2, ఊర్కొండలో 12.3, కొండనాగులలో 12.4, కల్వకుర్తిలో 12.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం వేళల్లో చలి కారణంగా జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

News November 15, 2025

సైదాపూర్: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

image

సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని రెడ్డి అర్చన అనుమానాస్పదంగా మృతి చెందింది. శుక్రవారం కళాశాలకు వెళ్లి పరీక్ష రాసి ఇంటికి వచ్చిన అర్చన, శనివారం తెల్లవారుజామున మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 15, 2025

ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. MBNRలో ఇదీ పరిస్థితి..!

image

MBNR జిల్లాలో ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. అత్యల్పంగా బాలానగర్ మండల కేంద్రంలో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్‌లో 11.1, గండీడ్ మండలం సల్కర్‌పేటలో 11.3, మిడ్జిల్‌లో 12.3, కోయిలకొండ సిరివెంకటాపుర్, భూత్‌పూర్‌లో 12.7, మహ్మదాబాద్‌లో 13.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.