News August 1, 2024

సీఎం ప్రకటనతో జిల్లా వాలంటీర్లలో ఆనందం

image

జిల్లాలో 6385 మంది వాలంటీర్ల ఆశలు చిగురించాయి. దీనికి ప్రధాన కారణం తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాలంటీర్లను కొనసాగిస్తామని ప్రకటించడమే. ఎన్నికల సమయంలో జిల్లా వ్యాప్తంగా రాజీనామా చేయకుండా 6385 మంది వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, అందుకు గల విధివిధానాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు ప్రభుత్వం సైతం ప్రకటించింది. అయితే జిల్లాలో రాజీనామా చేసిన వాలంటీర్‌ల పరిస్థితి తేలాల్సి ఉంది.

Similar News

News November 16, 2025

ప్రకాశం జిల్లాకు 2 రోజుల పాటు మోస్తరు వర్షసూచన

image

ప్రకాశం జిల్లాకు 2 రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావం జిల్లాలోని పలు మండలాలపై ఉంటుందన్నారు. ఇది ఇలా ఉంటే జిల్లాలో ఇటీవల చలి ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది.

News November 15, 2025

ప్రకాశం జిల్లాకు 2 రోజులు పాటు మోస్తరు వర్షసూచన

image

ప్రకాశం జిల్లాకు 2 రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావం జిల్లాలోని పలు మండలాలపై ఉంటుందన్నారు. ఇది ఇలా ఉంటే జిల్లాలో ఇటీవల చలి ప్రభావం అధికంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది.

News November 15, 2025

ప్రకాశం: ‘విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలి’

image

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు అందించడంలో ఖర్చు చేస్తుందని వివరించారు.