News June 27, 2024
సీఎం రేవంత్ నివాసానికి జీవన్ రెడ్డి

ఢిల్లీలోని రేవంత్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గురువారం వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దీపా దాస్ మున్షీ, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ సమావేశమయ్యారు. జీవన్ రెడ్డికి పార్టీ హై కమాండ్ తగిన ప్రాధాన్యత ఇస్తుందని, వేరే పార్టీలు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.
Similar News
News November 27, 2025
కరీంనగర్లో తొలి రోజు 92 సర్పంచ్ నామినేషన్లు

కరీంనగర్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి రోజు 92 సర్పంచ్ నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. గంగాధరలో అత్యధికంగా 28 నామినేషన్లు దాఖలయ్యాయి. చొప్పదండిలో 15, కొత్తపల్లిలో 12, కరీంనగర్ రూరల్లో 10, రామడుగులో 27 నామినేషన్లు నమోదయ్యాయి. 866 వార్డులకు గాను, తొలి రోజు 86 వార్డు సభ్యుల నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వివరించారు.
News November 27, 2025
KNR: “ఆరోగ్య మహిళ” వైద్య పరీక్షలు తప్పనిసరి: కలెక్టర్

జిల్లాలోని మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా ఉచిత వైద్య పరీక్షలను మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ టీఎన్జీవో సంఘ భవనంలో ఎన్జీవోల సంఘం, జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా, కలెక్టర్ హాజరై ఆరోగ్య పరీక్షలను పరిశీలించారు. సుమారు రూ.50 వేల విలువచేసే 45 రకాల పరీక్షలు ఈ కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News November 27, 2025
KNR: ఉత్సాహంగా దివ్యాంగుల ఆటల పోటీలు

మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల జిల్లా స్థాయి ఆటల పోటీలు కరీంనగర్ లోని డా.బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. కలెక్టర్ పమేలా సత్పతి హాజరై పలు ఆటల పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. గెలుపొందిన వారికి మెడల్స్ అందజేశారు. చెస్, క్యారం, రన్నింగ్, షార్ట్ పుట్, జావలిన్ త్రో వంటి పోటీల్లో విభాగాల వారీగా అంధులు, బధిరులు, శారీరక, మానసిక దివ్యాంగులు తమ ప్రతిభను చాటారు.


