News January 29, 2025

సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు కౌంటర్

image

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. రైతుల అప్పులు ముఖ్యమా..? దావోస్ డబ్బులు ముఖ్యమా..? అంటూ X వేదికగా ప్రశ్నించారు. ఎంవోయూలపై రేవంత్, భట్టి పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. మీ లెక్కలు డొల్ల ప్రచారమని తేలిపోయింది అన్నారు. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తానని ఇవ్వలేదు. గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్న రైతులను మోసం చేశారని విమర్శించారు.

Similar News

News December 1, 2025

సిద్దిపేట: ఎన్నికలపై అధికారులతో కలెక్టర్ సమావేశం

image

గ్రామపంచాయతీ ఎలక్షన్ నేపథ్యంలో ఎంపీడీఓ, ఎంపీఓ, అర్ఓ, ఏఅర్ఓ ఇతర అధికారులతో కలెక్టర్ హైమావతి సోమవారం జూమ్ సమావేశం నిర్వహించి అధికారులకు ఎలక్షన్ ప్రక్రియ గురించి దిశా నిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మొదటి విడత స్క్రూటిని ప్రక్రియ గురించి ఆరా తీశారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మాకర్గదర్హకాలకు అనుగుణంగా స్క్రూటిని చేయాలన్నారు.

News December 1, 2025

ఇంట్లో గణపతి విగ్రహం ఉండవచ్చా?

image

గృహంలో వినాయకుడి ప్రతిమను నిరభ్యంతరంగా ప్రతిష్ఠించవచ్చని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇష్ట దైవాలు, కుల దేవతల విగ్రహాలతో పాటు గణపతి విగ్రహాన్ని కూడా పూజా మందిరంలో పెట్టవచ్చు అని చెబుతున్నారు. అయితే, నవ గ్రహాలు, ఉగ్ర దేవతా మూర్తుల విగ్రహాలు లేదా చిత్ర పటాలు పూజా గదిలో లేకుండా చూసుకోవడం ఉత్తమమని వివరిస్తున్నారు. వాస్తు ప్రకారం.. గణపతి విగ్రహం ఉంటే ఎలాంటి దోషం ఉండదంటున్నారు.<<-se>>#Vasthu<<>>

News December 1, 2025

సిరిసిల్ల: ‘బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యం’

image

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి 27 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.