News November 13, 2024
సీఎం రేవంత్ రెడ్డితో నెదర్లాండ్స్ రాయబారి భేటీ

నెదర్లాండ్స్ దేశ రాయబారి మరిసా జెరార్డ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఢిల్లీలోని వారి అధికారిక నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికల పట్ల నెదర్లాండ్స్ రాయబారి జెరార్డ్ ఆసక్తి కనబర్చారు. ఈ భేటీలో టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ పాల్గొన్నారు.
Similar News
News February 26, 2026
హైదరాబాద్‌లో ప్రత్యక్ష నరకం

HYDలో దోమల బెడద కునుకు లేకుండా చేస్తోంది. పొగబెట్టినా పోతలే, నిద్రపోనిస్తలే.. ఆరోగ్యాలు పాడవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి, నాచారం, ఎల్బీనగర్, ఉప్పల్, కుంట్లూర్, పెద్దఅంబర్‌పేట్, మంచాల, రాజేంద్రనగర్, శంషాబాద్, షాద్‌నగర్‌లో ఎక్కువగా ఉంది. రాత్రంతా నరకం చూపిస్తున్నాయని వాపోతున్నారు. మునుపెన్నడూ లేనంతగా వ్యాప్తిచెందినా యంత్రాంగానికి చీమకుట్టినట్లు లేదా అని ప్రశ్నిస్తున్నారు.
News February 26, 2026
ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు

ఉస్మానియా మెడికల్ కాలేజీలో కాంట్రాక్టు ప్రాతిపదికన 8 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.రాజారావు తెలిపారు. దరఖాస్తులను ఫిబ్రవరి 29 నుంచి మార్చి 5 వరకు ప్రిన్సిపల్ కార్యాలయంలో సమర్పించాలి. అర్హతలు, మార్గదర్శకాలు తదితర వివరాలకు కళాశాల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
SHARE IT