News November 8, 2024
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంచిర్యాల ఎమ్మెల్యే
సీఎం రేవంత్ రెడ్డిని శుక్రవారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదారాబాద్‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ది పథంలో పయనిస్తోందని తెలిపారు.
Similar News
News December 14, 2024
గూడెం దేవాలయంలో ట్రిబ్యునల్ ఛైర్మన్ పూజలు
దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయాన్ని దర్శించుకున్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన కుటుంబ సమేతంగా గూడెం గుట్ట దేవాలయంలోని శ్రీ సత్యనారాయణ స్వామి వారి దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు దేవాలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
News December 14, 2024
బెల్లంపల్లి: ఊయల మెడకు చుట్టుకొని మహిళ మృతి
కూతురును ఆడించేందుకు కట్టిన ఊయల తల్లి మెడకు చుట్టుకొని మహిళ మృతి చెందిన ఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. 1టౌన్ SHO దేవయ్య వివరాల ప్రకారం.. బెల్లంపల్లిబస్తికి చెందిన నీరజ(42) తన కూతురు కోసం ఇంట్లో చీరతో ఊయల కట్టింది. గురువారం కూతురును ఒళ్లో కూర్చోపెట్టుకొని ఇద్దరు ఊయల ఊగుతూ ఆడించింది. కూతురును దించి కుమారుడికి ఊయల ఊగడం చూపిస్తుండగా ప్రమాదవశాత్తు చీర చుట్టుకుని ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు.
News December 14, 2024
నిర్మల్ : బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి సీతక్క
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు.