News January 25, 2025

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంచిర్యాల MLA

image

దావోస్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శుక్రవారం మంచిర్యాల ఎమ్మేల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం దావోస్ పర్యటన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు.

Similar News

News November 26, 2025

తలకు నూనె ఎప్పుడు రాయాలంటే?

image

తలస్నానం చేయడానికి కనీసం ఒక గంట/ రెండు గంటల ముందు నూనె రాయాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లకు తగిన పోషణ అంది జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు బాగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా పొడి జుట్టు, నిర్జీవమైన జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వారానికి రెండుసార్లు నూనె రాస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. రాత్రిళ్లు నూనె రాయకూడదని చెబుతున్నారు.

News November 26, 2025

వేప మందుల వాడకం.. ఇలా అధిక లాభం

image

పంటల్లో వేపనూనె వాడేటప్పుడు సబ్బు ద్రావణం తప్పనిసరిగా వాడాలి. వేపనూనె, ద్రావణాలను సాయంత్రం చల్లితే ఫలితం బాగుంటుంది. ద్రావణాన్ని తయారు చేసిన తర్వాత వెంటనే పిచికారీ చేయాలి. ఆలస్యం చేయకూడదు. పంటకు హానిచేసే పురుగుల గుడ్డు పొదిగే దశలో వేప మందును చల్లితే లార్వాల సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చు. బాగా ఎదిగిన లార్వాలు పంటను ఆశిస్తే వేప మందులను నిపుణుల సూచనలతో రసాయన మందులతో కలిపి వాడితే ఫలితాలు బాగుంటాయి.

News November 26, 2025

HYD: శివారులో మాయమైపోతున్నయమ్మ పల్లెలు!

image

దేశానికి పల్లెలే పట్టుగొమ్మలని పెద్దలు చెప్పేవారు.. అయితే ఇపుడు నగర శివారులో ఉన్న పల్లెలు మాయమవుతున్నాయి. అవి పట్నాలుగా కాదు.. ఏకంగా నగరంగా మారిపోతున్నాయి. సిటీ చుట్టుపక్కల ఉన్న పల్లెలు, మున్సిపాలిటీలను ప్రభుత్వం GHMCలో విలీనం చేస్తూనే ఉంది. అప్పట్లో 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న హైదరాబాద్ నగరం 2వేల చదరపు కిలోమీటర్లున్న నగరంగా మారుతోందంటే ఎన్ని పల్లెలు మాయమై ఉంటాయో ఆలోచించండి.