News March 16, 2025
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైబల్ యూనివర్శిటీ వీసీ

సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ వైఎల్. శ్రీనివాస్ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని శ్రీనివాస్ శాలువాతో సన్మానించి సత్కరించారు. మొట్టమొదటి, నూతన వీసీగా నియామకమైన శ్రీనివాస్కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలని సూచించారు.
Similar News
News March 17, 2025
OUలో పీహెచ్డీ ప్రవేశాలకు గడువు పొడిగింపు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని ఫ్యాకల్టీల కేటగిరి 2 పీహెచ్డీ సీట్ల భర్తీకి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసేందుకు గడువును పొడిగించినట్లు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. రూ. 2000 అపరాధ రుసుంతో ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ప్రవేశ పరీక్షలు వచ్చేనెల 25 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.
News March 17, 2025
కాచిగూడ: ‘దేశ జనాభా గణనలో కులగణన చేపట్టాలి’

దేశ జనాభా గణనలో కులగణన చేపట్టాలని జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడలో రోడ్డుపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో బీసీలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. దేశ జనాభాలో 60శాతనికి పైగా ఉన్న బీసీలకు 27 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయన్నారు.
News March 17, 2025
భూభారతి చట్టంలోనూ అనేక లోపాలు: మల్లారెడ్డి

ధరణిలో లోపాలు పరిష్కరించకుండానే రద్దుచేసి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చారని ఈ చట్టంలోకూడా లోపాలు ఉన్నాయని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణలో భూచట్టాలు పరిణామ క్రమం – ధరణి – భూభారతి చట్టాలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. భూ సమస్యలు పరిష్కరించకుండా సంవత్సరాల తరబడి కొనసాగిస్తున్న దుస్థితి ఉందన్నారు.