News July 5, 2024
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నిర్మల్ కాంగ్రెస్ నాయకులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిర్మల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విట్టల్ బీఆర్ఎస్‌కి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఆయనతో కలిసి సీఎంను కలిసి శాలువాతో సత్కరించారు. ఇందులో పార్లమెంట్ జిల్లా ఇన్‌ఛార్జ్ సత్తు మల్లేశ్, మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్జున్ మాన్ అలీ, తదితరులున్నారు.
Similar News
News December 10, 2024
ఆదిలాబాద్: ‘ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలి’
భీంపూర్ మండలం వడూర్ గ్రామ సమీపంలో ఉన్న పెన్ గంగా నది తీరంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వడూర్ గ్రామస్థులు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. పెనుగంగా నుంచి జేసీబీలతో లారీలు, ట్రాక్టర్లు, టిప్పర్లు నింపుకొని గ్రామం నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనీ పేర్కొన్నారు. దీని వలన రోడ్లు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.
News December 9, 2024
అభయారణ్యంలో వ్యవసాయ విద్యార్థుల పర్యటన
జన్నారం మండలం కవ్వాల్ అభయారణ్యంలో జగిత్యాల వ్యవసాయ కళాశాలకు చెందిన విద్యార్థులు పర్యటించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం వారు జన్నారం మండలంలోని గోండుగూడా, తదితర అటవీ క్షేత్రాలలో పర్యటించారు. ఈ సందర్భంగా వారికి బటర్ఫ్లై పరిరక్షణ కేంద్రం, అడవులు వన్యప్రాణుల సంరక్షణ, తదితర వివరాలను అటవీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
News December 9, 2024
బాసర లాడ్జిలో యువకుడి సూసైడ్
బాసరలోని ఓ ప్రైవేటు లాడ్జిలో ఆదివారం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. SI గణేశ్ వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం సూరారానికి చెందిన రాజేందర్ (25) నిన్న లాడ్జిలో ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ‘అమ్మా నన్ను క్షమించు, తమ్ముడిని బాగా చూసుకో, నిన్ను చాలా కష్టపెట్టిన, ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ’ సూసైడ్ నోట్‌ను అతడి తమ్ముడి ఫోన్‌కు పంపినట్లు SI వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.