News July 14, 2024
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి కొండా సురేఖ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రముఖ సినీ నటుడు సాయి ధరమ్ తేజ్, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
Similar News
News October 14, 2024
రామప్పను సందర్శించిన స్విట్జర్లాండ్ దేశస్థురాలు
ములుగు జిల్లాలో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని ఆదివారం MS.సాండ్ర అనే స్విట్జర్లాండ్ దేశస్థురాలు సందర్శించారు. ఆమెకు డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం అండ్ ఆర్కియాలజీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గైడ్ సాయినాథ్ ఆలయ విశేషాలను, శిల్పకళా నైపుణ్యాన్ని వివరించారు. ఆలయ పరిసర ప్రాంతాలలోని కేన్ మొక్కల గురించి స్థానిక గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ తెలియజేశారు.
News October 13, 2024
కాలేజీలు బంద్ చేస్తే చర్యలు: కేయూ రిజిస్ట్రార్
ప్రభుత్వం నుంచి ప్రైవేట్ కళాశాలలకు విడుదలయ్యే ఫీజు రీయంబర్స్‌మెంట్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో రేపటి నుంచి కళాశాలను బంద్ చేస్తామని రిజిస్ట్రార్‌కు ప్రైవేట్ యాజమాన్యాలు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ విశ్వవిద్యాలయ పరిధిలోని ప్రైవేట్ కళాశాలలను నిరవధికంగా బంద్ చేస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ ఆచార్య మల్లారెడ్డి హెచ్చరించారు.
News October 13, 2024
హర్యానా గవర్నర్‌ను కలిసిన మాజీ MLA
హైదరాబాద్‌లోని నాంపల్లిలో నిర్వహించిన అలాయ్.. బలాయ్ కార్యక్రమంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పాల్గొన్నారు. అనంతరం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను మాజీ ఎమ్మెల్యే కలిసి పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు అశోక్ రెడ్డి, ముఖ్య నేతలు, తదితరులు పాల్గొన్నారు.