News November 19, 2024

సీఎం రేవంత్ రెడ్డి అల్లుడుపై ఈడికి ఫిర్యాదు

image

సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు కొలుగూరి సత్యనారాయణపై బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో ఈడికి ఫిర్యాదు చేశారు. కొడంగల్ ఫార్మా కంపెనీలో రేవంత్ రెడ్డి అల్లుడికి భాగస్వామ్యం ఉందని ఆధారాలతో సహా బీఆర్‌ఎస్‌నేత క్రిశాంక్ ఫిర్యాదు చేశారు. MAXBIEN కంపెనీలో సీఎం అల్లుడు డైరెక్టర్‌గా కొనసాగుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Similar News

News December 13, 2024

లగచర్లకు వెళ్తా.. ఎవరడ్డొస్తారో చూస్తా: డీకే అరుణ

image

గుండెనొప్పి సమస్య ఉందని చెప్పిన రైతు హిర్యానాయక్‌కు సంకెళ్లువేసి తీసుకెళ్తారా అని MP DK అరుణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లగచర్లకు చెందిన రైతు హీర్యానాయక్‌కు పోలీసులు బేడీలువేసి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటనపై ఆమె స్పందించారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి ప్రకటన విడుదల చేశారు. అరెస్టు చేసిన రైతులను బేషరతుగా విడుదల చేయాలన్నారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత లగచర్లకు వెళ్తానని ఎవరడ్డొస్తారో చూస్తానని పేర్కొన్నారు.

News December 13, 2024

లగచర్ల రైతుకు బేడీలు.. MBNR ఎంపీ ఫైర్

image

లగచర్ల కేసులో రైతుకు బేడీల వ్యవహారంపై MBNR ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. ఆమె నేడు ఢిల్లీలో మాట్లాడుతూ.. ఏం తప్పు చేశాడని రైతు హీర్యానాయక్‌కు సంకెళ్లు వేశారు..? అమాయకులపై కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, సంకెళ్లు వేయడం ఇదేనా మీ ప్రజాపాలన అంటే అని ఫైర్ అయ్యారు. సీఎం సొంత నియోజకవర్గంలో శాంతిభద్రతలు కాపాడుకోవడం చేతగాక అమాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు.

News December 13, 2024

వనపర్తి: కొడుకు మందలించాడని తల్లి సూసైడ్‌‌

image

కొడుకు మందలించాడన్న మనస్తాపంతో తల్లి సూసైడ్ చేసుకున్న వనపర్తి జిల్లాలో జరిగింది. SI సురేశ్‌‌ గౌడ్‌‌ తెలిపిన వివరాలు.. ఖిల్లాఘనపురం మండలం మానాజీపేటకు చెందిన కాశమ్మ(68) తరచుగా కల్లు తాగుతుండడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈదే విషయంలో గురువారం మరోసారి గొడవ పడగా కాశమ్మ ఇంట్లోంచి వెళ్లిపోగా గ్రామ శివారులోని చెరువులో డెడ్‌‌బాడీ దొరికింది.ఆమె కొడుకు శ్రీను ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.