News March 22, 2024
సీఎం రేవంత్ రెడ్డి కలిసిన జిల్లా నాయకులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముఖ్య నాయకులు శుక్రవారం ఆయన చాంబర్ లో కలిశారు. మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ప్రతాప్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు కలిశారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల అంశంపై చర్చించారు. పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సీఎం సూచించారు.
Similar News
News September 19, 2024
MBNR: 15 కాలేజీలకు రెగ్యులర్ ప్రిన్సిపల్స్ లేరు..!
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 72 మండలాల్లో మొత్తం 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 15 జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. NGKL జిల్లాలో 5, WNP జిల్లాలో 5, GDWL జిల్లాలో 3, NRPT జిల్లాలో 2 ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో జూనియర్ అధ్యాపకులకు పదోన్నతులు కల్పిస్తూ ఈ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.
News September 19, 2024
MBNR: ఓటర్ జాబితాలో సవరణలు చేయండి: కలెక్టర్
గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ జాబితాలో ఈనెల 21 వరకు మార్పులు చేర్పులు చేసుకోవాలని MBNR జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సూచించారు. బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. కొత్త ఓటర్ల నమోదు, మృతి చెందిన వారి పేర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లు తొలగింపు, చిరునామా మార్పు, తప్పులను సరిదిద్దడం లాంటి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆమె తెలిపారు.
News September 18, 2024
ప్రపంచ వెదురు దినోత్సవంలో శ్రీనివాస్ గౌడ్
వెదురుకు ప్రపంచంలో ఎంతో గుర్తింపు ఉందని మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తికి నిత్యావసరాలలాగే వెదురు వస్తువులు కూడా ఎంతో అవసరం అన్నారు. ఇలాంటివి తయారు చేసే కార్మికులను ప్రతి ఒక్కరూ అభినందించాలన్నారు.