News February 14, 2025
సీఎం రేవంత్ రెడ్డి LOVE STORY మీకు తెలుసా..?

పడవలో ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డారు మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ఇంటర్ చదివే రోజుల్లో నాగార్జునసాగర్ వెళ్లిన రేవంత్‌కు పడవలోనే గీతారెడ్డిని చూసి మనసు పారేసుకున్నారు. ఇంకేముంది.. పరిచయం కాస్త స్నేహంగా.. స్నేహం కాస్త ప్రేమగా మారింది. రేవంత్ రెడ్డి గీతారెడ్డి తరఫున వారి ఇంట్లో మాట్లాడి ప్రేమను గెలిపించుకున్నారు. రెండు కుటుంబాల అంగీకారంతో 1992లో ఒక్కటయ్యారు.
Similar News
News March 24, 2025
బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తోటపల్లిగూడూరు వాసి

బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తోటపల్లిగూడూరుకు చెందిన జానకి ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం విజయవాడ బీఎస్పీ కార్యాలయంలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. అలాగే కార్యక్రమంలో జానకి ప్రసాద్‌కు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తి రుపతి, చిత్తూరు జిల్లాల ఇన్‌ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. పార్టీ అభివృద్ధికి తాను చేసిన సేవలను గుర్తించినందుకు ఆయన పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు.
News March 24, 2025
తాడేపల్లిలో పామర్రు మహిళ దారుణ హత్య

ఎన్టీఆర్ జిల్లా తాడేపల్లి కొలనుకొండ వద్ద ఆదివారం రాత్రి నిర్మానుష్య ప్రాంతంలో వివాహిత దారుణ హత్యకు గురైన విషయం తెలిసినదే. మృతురాలు కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన సజ్జా లక్ష్మీ తిరుపతమ్మగా పోలీసులు గుర్తించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త మృతి చెందడంతో కుటుంబ పోషణ భారమై క్యాటరింగ్ పనులకు వెళ్తోంది. లక్షీ తిరుపతమ్మ ఆదివారం విజయవాడలో క్యాటరింగ్ పనికి వెళ్తున్న క్రమంలో హత్యకు గురైంది.
News March 24, 2025
పోలీసులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి: ఎస్పీ కిరణ్ ఖరే

పోలీసులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దివస్‌లో 21 మంది ఆర్జీదారుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఆయన ఫోన్‌లో మాట్లాడి, సమస్యల పూర్తి వివరాలను సమర్పించాలని, ప్రతి కేసుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.