News February 14, 2025
సీఎం రేవంత్ రెడ్డి LOVE STORY మీకు తెలుసా..?

పడవలో ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డారు మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ఇంటర్ చదివే రోజుల్లో నాగార్జునసాగర్ వెళ్లిన రేవంత్ పడవలో గీతారెడ్డిని చూసి మనసు పారేసుకున్నారు. ఇంకేముంది.. పరిచయం కాస్త స్నేహంగా.. స్నేహం కాస్త ప్రేమగా మారింది. రేవంత్ రెడ్డి గీతారెడ్డి తరఫున ఆమె ఇంట్లో మాట్లాడి ప్రేమను గెలిపించుకున్నారు. రెండు కుటుంబాల అంగీకారంతో 1992లో ఒక్కటయ్యారు.
Similar News
News November 19, 2025
ఈ ఏడాది 328 రోడ్డు ప్రమాదాల్లో మరణాలు: సీపీ

ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది నవంబర్ 18వ తేదీ వరకు వ్యక్తుల మరణాలకు సంబంధించిన రోడ్డు ప్రమాదాలు 328 జరిగాయని పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 92 ప్రమాదాలు తక్కువగా జరిగాయని ఆయన వివరించారు. నందిగామలోని అనాసాగరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటన నేపథ్యంలో కమిషనర్ ఈ వివరాలను వెల్లడించారు.
News November 19, 2025
చింతూరు: ఆడుతూ స్పృహ తప్పి చిన్నారి మృతి

చింతూరు మండలం కుయుగూరులో చిన్నారి శ్యామల జనని(5) బుధవారం ఆకస్మికంగా మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. బాలిక తోటి పిల్లలతో అంగన్వాడీ కేంద్రానికి వెళుతూ దారిలో ఉన్న రేగుపళ్లు తిని ఆడుకుంటుండగా స్పృహ తప్పి పడిపోయిందని గ్రామస్థులు తెలిపారు. కుటుంబ సభ్యుల చింతూరు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అన్నారు.
News November 19, 2025
NRPT: బాలల భవిష్యత్తుకు కృషి చేయాలి: కలెక్టర్

నారాయణపేటలో బాలల బంగారు భవిష్యత్తు కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని, బాలల హక్కుల సంరక్షణలో భాగస్వాములవ్వాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


