News February 14, 2025

సీఎం రేవంత్ రెడ్డి LOVE STORY మీకు తెలుసా..?

image

పడవలో ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డారు మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ఇంటర్ చదివే రోజుల్లో నాగార్జునసాగర్‌ వెళ్లిన రేవంత్‌ పడవలో గీతారెడ్డిని చూసి మనసు పారేసుకున్నారు. ఇంకేముంది.. పరిచయం కాస్త స్నేహంగా.. స్నేహం కాస్త ప్రేమగా మారింది. గీతారెడ్డి తరఫున వారి ఇంట్లో మాట్లాడి ప్రేమను గెలిపించుకున్నారు. రెండు కుటుంబాల అంగీకారంతో 1992లో ఒక్కటయ్యారు.

Similar News

News March 12, 2025

గార్ల: బైక్ యాక్సిడెంట్ మహిళకు తీవ్ర గాయాలు

image

గార్ల మండలంలోని పూమ్యా తండా శేరిపురం వెళ్లే రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు బుధవారం ఢీకొన్నాయి. ఒక ద్విచక్ర వాహనంపై మహిళా డ్రైవింగ్ చేస్తుండగా, మరొక వాహనం ఎదురుగా వచ్చి ఢీకొనడంతో మహిళకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. తోటి వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు.

News March 12, 2025

ప్రకాశం జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా కవిత

image

ప్రకాశం జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా టంగుటూరు మండలానికి చెందిన గడ్డం కవిత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గ్రామీణ అభివృద్ధి సంస్థ జిల్లా డైరెక్టర్ నారాయణ తెలిపారు. ఒంగోలులోని టీటీడీసీ కార్యాలయంలో బుధవారం జరిగిన జిల్లా సమాఖ్య అధ్యక్షురాలి ఏన్నికల్లో 38 మండలాలకు చెందిన మండల సమాఖ్య అధ్యక్షులు, ఆఫీస్ బేరర్స్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ.. ఎన్నికకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

News March 12, 2025

MHBD: గాంధీ సిద్ధాంతాల బ్రోచర్ ఆవిష్కరణ

image

మహబూబాబాద్ విద్యాశాఖ కార్యాలయంలో గాంధీ సిద్ధాంతాల కరపత్రాలు, బ్రోచర్లను జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. 1930 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రం సబర్మతి ఆశ్రమం నుంచి మార్చి 12న మొదలై దండి వరకు 24 రోజుల పాటు జరిగిన ఉప్పు సత్యాగ్రహ మార్చ్ దేశ చరిత్రలో కీలక ఘట్టంగా పేర్కొంటారని తెలిపారు. నెల రోజులు జిల్లా వ్యాప్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

error: Content is protected !!