News February 14, 2025
సీఎం రేవంత్ రెడ్డి LOVE STORY మీకు తెలుసా..?

పడవలో ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డారు మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ఇంటర్ చదివే రోజుల్లో నాగార్జునసాగర్ వెళ్లిన రేవంత్ పడవలో గీతారెడ్డిని చూసి మనసు పారేసుకున్నారు. ఇంకేముంది.. పరిచయం కాస్త స్నేహంగా.. స్నేహం కాస్త ప్రేమగా మారింది. గీతారెడ్డి తరఫున వారి ఇంట్లో మాట్లాడి ప్రేమను గెలిపించుకున్నారు. రెండు కుటుంబాల అంగీకారంతో 1992లో ఒక్కటయ్యారు.
Similar News
News March 26, 2025
‘రాబిన్‌హుడ్’కి వార్నర్ రెమ్యునరేషన్ ఎంతంటే?

నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘రాబిన్‌హుడ్’ సినిమాలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్‌లో నటించారు. అయితే, అతని పాత్ర స్క్రీన్ మీద 2 నిమిషాల 50 సెకన్లు ఉంటుందని సమాచారం. ఇందుకోసం రెండు రోజులు షూటింగ్‌లో పాల్గొన్న ఆయన రూ.2.5 కోట్లు తీసుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న వార్నర్ తెలుగులో మాట్లాడి, డాన్స్ చేసి సందడి చేసిన విషయం తెలిసిందే.
News March 26, 2025
బెడ్‌రూమ్‌లో ఏ కలర్ లైట్ మంచిది?

రాత్రి నిద్రపోయే సమయంలో బెడ్‌రూమ్‌లో ఎరుపు రంగు లైట్ వేసుకుంటే చక్కగా నిద్ర పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అందులోనూ తక్కువ వెలుతురు వచ్చే బల్బును ఎంపిక చేసుకొంటే మంచిది. దీంతో మెదడులో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయ్యి నిద్ర నాణ్యత పెరుగుతుంది. అలాగే ఇష్టాలను బట్టి పసుపు, నారింజ/కాషాయం రంగులూ మంచి నిద్రకు సహకరిస్తాయి. మరోవైపు తెలుపు, నీలం రంగులు బెడ్‌రూమ్‌లో అస్సలు వాడకూడదని చెబుతున్నారు.
News March 26, 2025
ఇఫ్తార్ విందుకు ఈసీ నో

TG: రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో నిర్వహించదలచిన ఇఫ్తార్ విందుకు ఎన్నికల సంఘం అనుమతివ్వలేదు. ఈ కార్యక్రమంలో సీఎం, ఇతర నేతలు పాల్గొంటారని పర్మిషన్ ఇవ్వాలని లేఖ రాయగా ఈసీ తిరస్కరించింది. హైదరాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది.