News June 20, 2024
సీఎం రేవంత్ వద్దకు కుంట్లూరు గుడిసెల వ్యవహారం
హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్ మం. కుంట్లూరు రెవెన్యూ పరిధి భూదాన్ భూమిలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న పేదలకు న్యాయం చేయాలని సీపీఎం నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. CPI రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే సాంబశివరావు, నాయకులు జంగయ్య, రవీంద్ర చారి, ముత్యాల యాదిరెడ్డి, పర్వతాలు CMని కలిసి వినతి పత్రం అందించారు. ఈ వ్యవహారంపై ఆయన సానుకూలంగా స్పందించారని కూనంనేని వెల్లడించారు.
Similar News
News September 18, 2024
HYDలో పెద్ద ఆఫీసులకు డిమాండ్
విశాలమైన ఆఫీసులకు హైదరాబాద్‌లో భారీ డిమాండ్ ఉందని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. లక్ష చదరపు అడుగులు లేదా అంతకంటే ఎక్కువ స్థలంలో ఉన్న వాటిని లార్జ్ ఫార్మాట్ ఆఫీసులు అంటారు. ఈ ఏడాది మొదటి ఆర్నెళ్లలో (హెచ్1) 3.08 మిలియన్ చదరపు అడుగుల లావాదేవీల జాగా అమ్ముడైంది. గతేడాది మొదటి ఆర్నెళ్లలో 1.47 మిలియన్ చదరపు అడుగులు ఉంది, లావాదేవీలలో 61% వాటా ఈ సెగ్మెంట్‌లో ఉంది.
News September 18, 2024
HYD: మల్లారెడ్డి మెడికల్ కాలేజీపై ఎంక్వైరీ?
మల్లారెడ్డి మెడికల్ కాలేజీపై సర్కారు సీరియస్ ఉన్నట్లు తెలుస్తోంది. డీమ్డ్ హోదా సీట్లు మేనేజ్‌మెంట్ కోటా సీట్లగా భర్తీ చేస్తున్నారని విద్యర్థులు, పేరెంట్స్ అసోసియేషన్ నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. కాగా వైద్య కళాశాల నేషనల్ మెడికల్ కమిషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం దానికి అనుబంధమైన హాస్పిటల్స్ అంశంపై ఆ శాఖ మంత్రి నేడు ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు.
News September 18, 2024
HYD: రాత్రంతా ఆగని శానిటేషన్!
ఎల్బీనగర్ పరిధిలోని సరూర్ నగర్ చెరువు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో అర్ధరాత్రి సమయంలోను శానిటేషన్ పనులు కొనసాగాయి. అర్ధరాత్రిలో విధులు నిర్వహించిన బృందాలను కమిషనర్ ఆమ్రపాలి కాటా ప్రత్యేకంగా అభినందించారు. సరూర్‌నగర్ ప్రాంతాల్లో నిమజ్జనాలు సజావుగా సాగినట్లుగా సరూర్‌నగర్ డిప్యూటీ కమిషనర్ సుజాత పేర్కొన్నారు.