News March 26, 2025
సీఎం రేవంత్ హుజూర్నగర్ పర్యటన షెడ్యూల్

HNRలో ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వివరాలను మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 5.45కు HNR రామస్వామి గుట్టలో డబల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలిస్తారు. 6.15కి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 6.15 నుంచి 7.30 వరకు సన్న బియ్యం పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. 7.30 తిరిగి హైదరాబాద్ పయనమవుతారు. సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Similar News
News November 27, 2025
జూబ్లీహిల్స్‌లో GHMC మోడల్ ఫుట్‌పాత్

జూబ్లీహిల్స్‌లో జీహెచ్ఎంసీ మోడల్ ఫుట్‌పాత్ ప్రాజెక్టు చేపట్టింది. రీసైకిల్ ప్లాస్టిక్ పేవర్లు, సోలార్ గ్రిడ్, టాక్టైల్ పేవింగ్‌తో పాదచారుల భద్రతను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఫిల్మ్‌నగర్- బీవీబీ జంక్షన్ మధ్య ఉన్న బీజీ కారిడార్‌లో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించి, పర్యావరణ హితంగా నిర్మించే ఈ ప్రాజెక్టు పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 27, 2025
ఖమ్మం: మీడియా సెంటర్ ప్రారంభించిన అ.కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్ మొదటి అంతస్తులోని ఎఫ్-3లో ఉన్న డీపీఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్‌ను అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి గురువారం ప్రారంభించారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు.
News November 27, 2025
ములుగు: పంచాయతీ ఎన్నికలకు 1,306 పోలింగ్ స్టేషన్లు

ములుగు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు 217 లొకేషన్లలో 1,306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి 146 సర్పంచ్, 1,290 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు 1,880 మంది పీఓలు, 2,010 మంది ఓపీఓలను నియమించారు. 1,566 బ్యాలెట్ బాక్స్‌లను ఉపయోగిస్తున్నారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయ్యింది. సర్పంచ్ బరిలో 8మంది కంటే ఎక్కువ మంది ఉంటే అప్పటికప్పుడు ముద్రించేలా ప్రింటింగ్ ప్రెస్‌లను గుర్తించారు.


