News March 16, 2025
సీఎం సభకు 960 మంది సిబ్బందితో భద్రత

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయడానికి వస్తున్న సందర్భంగా 960 మంది పోలీస్ సిబ్బందితో భద్రత కల్పిస్తున్నారు. ఎస్.పి, అడిషనల్ ఎస్పీ క్యాడర్‌కు చెందిన వారు 4 గురు, పది మంది డిఎస్పీలు, 69 సీఐలు మొత్తంగా 960 మంది సిబ్బందితో సీఎం సభకు భద్రత కల్పిస్తున్నట్లు సమాచారం.
Similar News
News February 26, 2026
పార్వతీపురం: ‘ఉగాది నాటికి 7,187 ఇళ్లు పూర్తి కావాలి’

జిల్లాలో గృహ నిర్మాణ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్‌లో భాగంగా గృహ నిర్మాణ పురోగతిపై కీలక సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉగాది పండగ నాటికి మొత్తం 7,187 ఇళ్లను పూర్తి చేయాలన్నారు.
News February 26, 2026
కన్నులపండువగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీసీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. తొలిరోజు స్వామి పుష్కరిణిలో తెప్పపై మూడు సార్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.
News February 26, 2026
జింబాబ్వేపై భారత్ విధ్వంసం.. స్కోర్ ఎంతంటే?

T20WC: చెన్నై వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చెలరేగారు. దీంతో టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్(55) హాఫ్ సెంచరీ చేశారు. ఇషాన్(38), సంజూ(24), సూర్య(33) రాణించారు. చివర్లో హార్దిక్(23 బంతుల్లో 50*), తిలక్(16 బంతుల్లో 44*) మెరుపులు మెరిపించారు. జింబాబ్వే టార్గెట్ 257 రన్స్.


