News August 8, 2024
సీఎం సభా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్
ఆగస్టు 15 తారీఖున సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించనున్న రైతంగ సదస్సు సభ స్థలాన్ని కలెక్టర్ ముజామ్మిల్ పరిశీలించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి గతంలో అనుకున్న స్థలంలో ఇబ్బందులు దృష్ట్యా మరొక స్థలాన్ని పరిశీలించి అధికారులకు తగు సూచనలను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 9, 2024
అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మం జిల్లాలోని SR&BGNR కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల నియామకాలు జరపడానికి అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జాకీరుల్లా తెలిపారు. ఇంగ్లీష్ 1, హిస్టరీ 3, ఎకనామిక్స్ 1, పొలిటికల్ సైన్స్ 2,కామర్స్ 2,బి.బి.ఏ 2, బి.సి.ఏ 1, గణితం 3,కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్ 3,డేటా సైన్స్ 1, బయోటెక్నాలజీ 1,బాటనీ1ఉన్నాయ. ఈ నెల11నజరిగే ఇంటర్వ్యూకి హాజరు కావాలన్నారు.
News September 8, 2024
స్వల్పంగా తగ్గుతున్న మున్నేరు వాగు
ఖమ్మం నగరంలో ప్రవహిస్తున్న మున్నేరు వాగు స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. ఆదివారం మధ్యాహ్ననానికి 13.50 అడుగుల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. 16 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఒంటిగంటకు 13.75 అడుగుల వద్ద ఉన్న మున్నేరు వరద రెండు గంటలకు 13.50 అడుగులకు పడిపోయింది. స్వల్పంగా తగ్గుతుండడంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
News September 8, 2024
వరదలపై రాజకీయం సరికాదు: కేంద్ర మంత్రి
ప్రకృతి వైపరిత్యాలు వంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలన్నారు. ఆదివారం ఖమ్మం ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అడ్వాన్స్ డిజాస్టర్ ఫండ్ కింద రూ.1,300 కోట్లు పంపిందని, వరదపై రాజకీయం చేయడం సరికాదన్నారు.