News March 25, 2025
సీఎం సభ ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

హుజూర్ నగర్లో ఈనెల 30న జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ నరసింహ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక అధికారులు సభా ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. సభకు తరలివచ్చే ప్రజలకు పార్కింగ్ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు ఉన్నారు.
Similar News
News October 15, 2025
నిర్మల్: మద్యం షాపులకు 42 దరఖాస్తులు

నిర్మల్ జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు బుధవారం 42 దరఖాస్తులు వచ్చాయని డీపీఈవో అబ్దుల్ రజాక్ తెలిపారు. గత పాలసీలో 701 దరఖాస్తులు వచ్చాయని, ఈ సారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. చివరి రోజు వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తులు దాఖలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దరఖాస్తు ఫారాలను ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 18 వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.
News October 15, 2025
పప్పులో కాలేసిన ఇన్వెస్టర్లు.. LG అనుకొని!

దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ‘LG ఎలక్ట్రానిక్స్’ స్టాక్మార్కెట్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇన్వెస్టర్లు షేర్లు కొనేందుకు ఎగబడ్డారు. అయితే చాలామంది సరైన కంపెనీని సెర్చ్ చేయకుండా పప్పులో కాలేశారు. LG ఎలక్ట్రానిక్స్కి బదులు పొరపాటున LG బాలకృష్ణన్ & బ్రదర్స్ లిమిటెడ్ షేర్లు కొనేశారు. దీంతో ఈ కంపెనీ షేర్లు ఒక్కసారిగా 20% పెరిగిపోయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
News October 15, 2025
సూర్యాపేట: ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయాలను కలిగి ఉండాలి: ఎస్పీ

ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయాలను కలిగి ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. బుధవారం సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పోలీసు ప్రజా భరోసాలో భాగంగా అవగాహన కల్పించి మాట్లాడారు. ప్రావీణ్యం ఉన్న అంశాలపై సాధన చేయాలని, చెడు అలవాట్లకు, చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రుల కష్టం చాలా విలువైనదన్నారు. అనంతరం డ్రగ్స్, సైబర్ మోసాల నివారణపై అవగాహన కల్పించారు.