News August 8, 2024
సీఎం సభ స్థలాన్ని పరిశీలించిన మంత్రి తుమ్మల

ఈనెల 15న జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభా స్థలాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ సిపి సునీల్ దత్ తో కలిసి పరిశీలించారు. సీఎం సభ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 13, 2026
ఖమ్మం: ఇంటర్ ఫలితాల్లో వారిదే పైచేయి

ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. బాలికలు పైచేయి సాధించి మేటిగా నిలిచారు. ప్రథమ సంవత్సరంలో 78.69% ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో 4వ స్థానాన్ని, ద్వితీయ సంవత్సరంలో 87.65% ఫలితాలతో 6వ స్థానాన్ని జిల్లా కైవసం చేసుకుంది. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం గణనీయంగా మెరుగుపడటంతో పాటు, జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో మెరవడంపై విద్యాశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
News April 13, 2026
ఖమ్మం: నేటి నుంచే రీకౌంటింగ్ దరఖాస్తులు

ఇంటర్ ఫలితాల్లో ఖమ్మం జిల్లా సత్తా చాటింది. ప్రథమ సంవత్సరంలో 72.06% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 4వ స్థానంలో, ద్వితీయ సంవత్సరంలో 81.60%తో 6వ స్థానంలో నిలిచింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం నేటి నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని డీఐఈఓ రవిబాబు తెలిపారు. మే 13 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు నిరుత్సాహపడకుండా సిద్ధం కావాలని ఆయన సూచించారు.