News October 18, 2024

సీఎం సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా నేతలు

image

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి 93 శాతం స్ట్రయిక్ రేట్ ఇచ్చారన్నారు.

Similar News

News February 28, 2026

భీమవరం: ఆహార భద్రతపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో ఆహార భద్రత, పశుసంవర్ధక శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. గత రెండ్రోజులుగా జరుగుతున్న తనిఖీల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్.. పాలు, నెయ్యి, వెన్న వంటి పదార్థాల్లో కల్తీని గుర్తించే విధానం, నమూనాల ల్యాబ్ పరీక్షలపై దిశానిర్దేశం చేశారు.

News February 27, 2026

కలెక్టరుకు చాక్‌పీస్‌ మైక్రోఆర్ట్‌ బహూకరణ

image

పెరవలి మండలం తీపర్రుకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ కోడూరి రాఘవేంద్ర బాబు తన ప్రతిభతో కలెక్టరును ఆకట్టుకున్నారు. చాక్‌పీస్‌పై కలెక్టర్ చదలవాడ నాగరాణి పేరును అద్భుతంగా చెక్కి, శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో ఆమెకు అందజేశారు. ఈ కళాఖండాన్ని చూసి విస్మయం చెందిన కలెక్టర్.. రాఘవేంద్ర బాబును ప్రత్యేకంగా అభినందించారు. తన పేరును ఇంత సూక్ష్మంగా, కళాత్మకంగా చెక్కడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.