News March 16, 2025
సీఎం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు: MP కావ్య

సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఎంపీ కడియం కావ్య మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిది అన్నారు. ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధి పదంలో నిలిపేందుకు రేవంత్ రెడ్డి అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. నియోజకవర్గానికి రూ.800 కోట్లు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. 2029లో రాహుల్ గాంధీ పీఎం అవుతారన్నారు.
Similar News
News November 29, 2025
NZB: టీ-పోల్ మొబైల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల సౌలభ్యం కోసం అందుబాటులోకి తెచ్చిన టీ-పోల్ మొబైల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. టీ-పోల్ యాప్ ద్వారా ఓటర్లు తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది అనే వివరాలను పరిశీలించుకోవాలన్నారు. ఓటరు స్లిప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
News November 29, 2025
అప్పటికల్లా నక్సలిజం అంతం: అమిత్ షా

దేశంలో నక్సలిజాన్ని అంతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. రాయ్పూర్లో జరిగిన DGP, IGP సదస్సులో మాట్లాడారు. తదుపరి కాన్ఫరెన్స్ జరిగే నాటికి ముందే నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ఏడేళ్లుగా మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. 2014లో నక్సల్ ప్రభావిత ప్రాంతాలు 126 ఉండగా, ప్రస్తుతం 11కి తగ్గినట్లు వెల్లడించారు.
News November 29, 2025
నేడే కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని శనివారం మచిలీపట్నంలోని జెడ్పీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ కన్నమ నాయుడు తెలిపారు. జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సభ్యులు, అధికారులు విధిగా హాజరు కావాలన్నారు. సమావేశంలో వివిధ అంశాలు, ఎంజెండాలపై చర్చ ఉంటుందని చెప్పారు.


